Hyderabad: వెళ్తూ.. వెళ్తూ.. సమాజానికి భలే మెసేజ్ ఇచ్చిన గణనాథుడు.. !

Updated on: Sep 05, 2025 | 9:21 AM

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బల్సిలాల్ నగర్‌లో బైక్‌ రైడర్‌ రూపంలో గణేషుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు నిర్వహించారు. బైక్‌పై గణేషుడు హెల్మెట్‌ ధరించి కూర్చున్నట్టుగా ప్రతిష్టించారు. ఈ వినాయకుడి ద్వారా సమాజానికి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బల్సిలాల్ నగర్‌లో బైక్‌ రైడర్‌ రూపంలో గణేషుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు నిర్వహించారు. బైక్‌పై గణేషుడు హెల్మెట్‌ ధరించి కూర్చున్నట్టుగా ప్రతిష్టించారు. ఈ వినాయకుడి ద్వారా సమాజానికి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బైక్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని మెసేజ్‌ ఇస్తూ లడ్డూతో పాటు వేలం పాటలో గణేశుడి చేతిలోని హెల్మెట్‌ను కూడా ఉంచడం విశేషం. గత ఏడాది ఈ వేలంలో ప్రణీత్ అనే యువకుడు హెల్మెట్‌ను 22 వేలకు కొనుగోలు చేయగా, ఈ సంవత్సరం ప్రణీత్‌, నిశాన్ కలిసి 55 వేలకు గణేశుడి హెల్మెట్‌ను దక్కించుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Published on: Sep 05, 2025 08:01 AM