Diwali 2024: విదేశాల్లోని భారతీయులు సైతం జరుపుకునే దీపావళి పండగను మన దేశంలో ఇక్కడ జరుపుకోరు.. ఎందుకంటే

|

Oct 12, 2024 | 9:56 AM

దీపావ‌ళి పండుగ వస్తుందంటే చాలు ప్రజల్లో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తుంది. దీపావళి రోజు సాయంత్రం దీపాలు వెలిగించడం ద్వారా ఇల్లంతా వెలుగులు నిండుతాయి. విదేశాల్లో నివసించే వారు కూడా ఈ పండుగను ఎంతో శ్ర‌ద్ధ‌తో, అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగను జరుపుకోని కొన్ని ప్రాంతాలు కూడా భారతదేశంలో ఉన్నాయి.

Diwali 2024: విదేశాల్లోని భారతీయులు సైతం జరుపుకునే దీపావళి పండగను మన దేశంలో ఇక్కడ జరుపుకోరు.. ఎందుకంటే
Diwali 2024
Follow us on

హిందూ మతంలో దీపావళి చాలా ముఖ్యమైన, ప్రత్యేకమైన పండుగ. దీపావళి ప్రతి సంవత్సరం ఆశ్వయుజ  మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు గణేశుడిని, లక్ష్మి దేవిని పూజిస్తారు. ఈ పండుగ వస్తుందంటే చాలు ప్రజల్లో భిన్నమైన ఉత్సాహం కనిపిస్తుంది. దీపావళి రోజు సాయంత్రం దీపాలు వెలిగించడం ద్వారా ఇల్లంతా వెలుగులు నిండుతాయి. విదేశాల్లో నివసించే వారు కూడా ఈ పండుగను ఎంతో శ్ర‌ద్ధ‌తో, అత్యంత వైభవంగా జరుపుకుంటారు. అయితే దీపావళి పండుగను జరుపుకోని కొన్ని ప్రాంతాలు కూడా భారతదేశంలో ఉన్నాయి.

దీపావళి ఎందుకు జరుపుకుంటారంటే

దీపావళి రోజున శ్రీ రాముడు తన 14 సంవత్సరాల వనవాసం ముగించుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాముడికి స్వాగతం పలికేందుకు అయోధ్య ప్రజలు నెయ్యి దీపాలు వెలిగించి రాముడు తిరిగి వచ్చినందుకు సంబరాలు చేసుకున్నారు. అప్పటి నుంచి దీపావళి సంబరాలు మొదలయ్యాయి. నాటి నుండి నేటి వరకు ప్రజలు దీపావళి రోజున దీపాలు వెలిగించి వినాయకుడిని, లక్ష్మీ దేవిని పూజిస్తారు.

ఈ రాష్ట్రాల్లో దీపావళి జరుపుకోరు

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో దీపావళి పండుగను జరుపుకోరు. వాస్తవానికి ఇక్కడ ప్రతి పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు.  అయితే దీపావళి పండగను మాత్రం జరుపుకోరు. ఈ రాష్ట్రంలో దీపావళిని ఘనంగా జరుపుకునే ఏకైక ప్రాంతం కొచ్చి నగరం మాత్రమే.

ఇవి కూడా చదవండి

కారణం ఏమిటి?

కేరళ ప్రజలు మహాబలి చక్రవర్తిని తమ రాజుగా భావిస్తారు. దీపావళి రోజున బలి చక్రవర్తి మరణించినందున ఇక్కడ దీపావళి పండుగ జరుపుకోరని నమ్మకం. అంతేకాదు దీపావళి జరుపుకోకుండా ఉండడానికి రెండవ కారణం రాష్ట్రంలో హిందువుల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకే ఇక్కడ దీపావళి పండుగను తక్కువగా జరుపుకుంటారు.

తమిళనాడులో

కేరళలో మాత్రమే కాదు తమిళనాడులోని కొన్ని చోట్ల దీపావళి పండగను జరుపుకోరు. అయితే నరక చతుర్దశ పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిధి రోజున శ్రీ కృష్ణుడు నరకాసురుడిని సంహరించాడ‌ని న‌మ్మ‌కం. అందుకే ఈ తిధిన ఛోటీ దీపావళిగా జ‌రుపుకుంటారు.

లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు?

శాస్త్రాల ప్రకారం దేవతలు, రాక్షసులు సముద్రాన్ని మథనం చేస్తున్న సమయంలో సముద్ర మథనం నుంచి  14 రత్నాలు పుట్టాయి. వాటిలో ఒకటి లక్ష్మి దేవి.  ఆశ్వయుజ మాసంలోని అమావాస్య రోజున లక్ష్మీదేవి జన్మించిందని ప్రతీతి. అందుకే దీపావళి రోజున గణేశుడిని, లక్ష్మీదేవిని పూజిస్తారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ రోజున లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంతోషం, శ్రేయస్సు, సంపద, కీర్తి, ప్రతిష్టలు లభిస్తాయి. భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి