Telugu News Spiritual Chanakya Niti in Telugu According to Acharya Chanakya a person should never dispute with these people
Chanakya Niti: ఈ నలుగురు వ్యక్తులతో ఎప్పుడూ వాదించకండి.. లేదంటే తర్వాత పశ్చాత్తాపపడతారు అంటున్న చాణక్య
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) సమాజం సంక్షేమం కోసం అనేక నియమాలను తెలిపాడు. నీతిశాస్త్రం(Niti Shastra)లో ఆచార్య చాణక్యుడు మానవులకు సంబంధించిన అనేక విషయాలను..
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Acharya Chanakya) సమాజం సంక్షేమం కోసం అనేక నియమాలను తెలిపాడు. నీతిశాస్త్రం(Niti Shastra)లో ఆచార్య చాణక్యుడు మానవులకు సంబంధించిన అనేక విషయాలను ప్రస్తావించాడు. ఆ నియమాలు నేటికీ అనుసరణీయమని పెద్దల నమ్మకం.
ఆచార్య చాణక్య ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో చాలా తప్పులు చేస్తాడు. తరువాత పశ్చాత్తాపపడతాడు. అటువంటి పరిస్థితిలో, వ్యక్తి అందరితో మంచి సంబంధాలను కొనసాగించడం అవసరం. ఒక వ్యక్తితో ఈ నలుగురు వ్యక్తులు వాదించకూడదని చెబుతున్నారు.
మూర్ఖుడు – ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక మూర్ఖుడితో ఎప్పుడూ వాదించకూడదు. దీనివల్ల సమయం వృథా అవుతుంది. మూర్ఖుడు ఎవరి మాట వినడు. అతను తన మాట మాత్రమే మాట్లాడుతాడు. కనుక అలాంటి వ్యక్తి నుంచి దూరంగా ఉండాలి
స్నేహితుడు – మన సుఖ దుఃఖాలను నిర్భయంగా చెప్పుకునే స్నేహితుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కడైనా ఉంటాడు. మన రహస్యాలు ఆ స్నేహితుడికి తెలుసు. అందుకే అలాంటి మంచి స్నేహితుడితో ఎప్పుడూ వాదించకండి. ఎందుకంటే అతనికి మీ పై వ్యతిరేకత ఏర్పడితే.. మీ రహస్య విషయాలను ఇతరుల ముందు వెల్లడించే ప్రమాదం ఉంది.
గురువు – గురువు ఎల్లప్పుడూ మనకు మార్గనిర్దేశం చేస్తాడు. లక్ష్యాన్ని సాధించడానికి ప్రేరణని ఇస్తాడు. గురువు లేకుండా.. మీరు జ్ఞానాన్ని కూడా పొందలేరు. అటువంటి పరిస్థితిలో మీరు గురువుతో వాదించకుండా ఉండటం ముఖ్యం. ఇది మీ భవిష్యత్తుపై చెడు ప్రభావం చూపుతుంది.
ప్రియమైనవారు – ప్రియమైనవారు జీవితంలో ముందుకు సాగడానికి ఒక వ్యక్తికి ప్రేరణగా నిలుస్తారు. అందువల్ల, మీ ప్రియమైన వారితో ఎప్పుడూ వాదించకండి. ఇది మీకు హాని కలిగించవచ్చు.