Chanakya Neeti: చాణక్య చెప్పిన జీవిత సూత్రం.. ఈ నాలుగు అలవాట్లు ఉంటే జీవితాంతం పేదరికంలో ఉంటారట!..

Chanakya Neeti: చాణక్య చెప్పిన జీవిత సూత్రం.. ఈ నాలుగు అలవాట్లు ఉంటే జీవితాంతం పేదరికంలో ఉంటారట!..
Chanakya Neethi

Chanakya Neeti: ఆచార్య చాణక్య.. జీవిత సత్యాలు, జీవన సూత్రాలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మనుషులు ఎలా బ్రతకాలి.. జీవితంలో రాణించాలంటే ఏం చేయాలి..

Shiva Prajapati

|

Jul 03, 2021 | 8:16 AM

Chanakya Neeti: ఆచార్య చాణక్య.. జీవిత సత్యాలు, జీవన సూత్రాలకు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మనుషులు ఎలా బ్రతకాలి.. జీవితంలో రాణించాలంటే ఏం చేయాలి.. ఎలాంటి విధానాలు అవలంభించాలి వంటి ఎన్నో అంశాలు పొందరుపరుస్తూ గ్రంథాలు రచించారు. అవి ఇప్పటికీ ఎంతో భద్రంగా ఉన్నాయి. ఆయన చెప్పిన ప్రతీ సూత్రం ప్రతి మనిషి జీవితంలో ఆచరణీయం. ఈ క్రమంలో ఆయన చెప్పిన ఒక ముఖ్యమైన అంశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ధనవంతుడు, పేదవాడు గా మిగిలిపోయేందుకు అతని అలవాట్లే కారణమని ఆచార్య చాణక్య అంటారు. వ్యక్తి ఆచరించే కొన్ని దురలవాట్లు.. వారి నుంచి లక్ష్మీ దేవిని దూరం చేస్తుందట. అలాంటి వారెప్పుడూ పేదరికంలో ఉంటారట. మరి చాణక్య చెప్పిన ఆ దురలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఉదయం సమయం చాలా కీలకం అంటారు ఆచార్య చాణక్య. ఈ సమాయాన్ని బాగా వినియోగించుకున్న వారు తప్పక గొప్పవారు అవుతారని చెబుతున్నారు. చాణక్య ప్రకారం.. ప్రతీ వ్యక్తి ఉదయాన్నే నిద్రలేచి ఆ సయాన్ని బాగా ఉపయోగించుకోవాలి. అయితే కొందరు ఉదయం 10 గంటలు అయినా గానీ నిద్ర లేవరు. మంచం దిగరు. అలాంటి వారిని లక్ష్మీ దేవి వరించదు. ఆ కారణంగా వారు నిత్యం పేదరికంలోనే మగ్గుతారు.

2. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దుస్తులు పరిశుభ్రమైనవి ధరించాలి. క్రమం తప్పకుండా స్నానం చేయడం, నోటిని శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రమైన దస్తులు ధరించడం వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యం అని చెబుతారు చాణక్య. అపరిశుభ్రంగా ఉండేవారి వద్ద లక్ష్మీ దేవి నిలువ ఉండదట. ఇలాంటి అపరిశుభ్రంగా ఉండే వారు నిత్యం వ్యాధుల బారిన పడుతూ.. డబ్బు కోల్పోతూ.. పేదరికంలోనే ఉండిపోతారట.

3. మనం తినే ఆహారం కూడా మన పేదరికాన్ని నిర్ణయిస్తుంని చాణక్య పేర్కొన్నారు. చాణక్య సూత్రం ప్రకారం.. ప్రతీ ఒక్కరూ సమయానికి ఆహారం తీసుకోవాలి. అలాగని.. నిత్యం తింటూనే ఉండాలని కాదు. జీవించడం కోసం సమయానికి తినాలని, తినడం కోసమే జీవించకూడదని చాణక్య పేర్కొన్నారు. మనస్సు ఎల్లప్పుడూ ఆహారంపై నిమగ్నమై ఉండే వారింట్లో డబ్బు ఎక్కువగా నిలువ ఉండదట.

4. మన తీరు, ప్రవర్తన కూడా లక్ష్మీ దేవి మన ఇంట్లో ఉండాలా? వొద్దా? అనేది నిర్ణయిస్తుందని చాణక్య పేర్కొన్నారు. ‘నోరు మంచిదయితే.. ఊరు మంచిదవుతుంది’ అనే నానుడిలా.. మంచిగా మాట్లాడే వారికి ప్రతీచోటా గౌరవం లభిస్తుంది. అలాంటి వారికి ప్రేమాభిమానాలు లభిస్తాయి. ఎప్పుడు చెడు మాట్లాడే వారిని ఎవరూ ఇష్టపడరు. ప్రజలతో వారి సంబంధాలు కూడా పెద్దగా ఉండవు. ప్రజలతోనే కాదు.. లక్ష్మీదేవి కూడా చెడు ప్రవర్తన కలిగిన వారి చెంత నిలువ ఉండదని చాణక్య పేర్కొన్నారు. మంచి నడవడిక, మంచి మాటలు మాట్లాడే వారిపై లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందట.

Also read:

Shahid Kapoor: కొత్తింటిని కొనుగోలు చేసిన షాహిద్‌ కపూర్.. ఈ డూప్లెక్స్‌ ఫ్లాట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Electricity Bill: గుడిసెలో ఉన్న వృద్ధురాలికి షాక్.. ఊహించని రీతిలో రూ. 2.5 లక్షల కరెంట్ బిల్లు.. 

Viral Video: వామ్మో! పాము పిల్లను ముక్కులోకి దూర్చుకుని.. నోట్లో నుంచి.. షాకింగ్ వీడియో వైరల్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu