రైల్వే లోకో పైలట్‌లకు లైసెన్స్ అవసరమా..?
TV9 Telugu
14 May 2024
ఏ దేశంలోనైనా కారు లేదా బైక్ నడపడానికి లైసెన్స్ అవసరం. అదేవిధంగా, రైలు డ్రైవర్‌కు కూడా లైసెన్స్ అవసరం.
రైలుకు మాత్రం సాధారణ లైసెన్స్ లాగా అనుమతి ఇవ్వరు. రైలు డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన తర్వాత అనుమతి లభిస్తుంది.
ఇందుకోసం రైల్వేశాఖ మొదట లోకో పైలట్‌లకి సంబంధించి ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ను నిర్వహిస్తుంది ఇండియన్ రైల్వే.
వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా లోక్ పైలట్లను రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
రైల్వే శాఖ నిర్వహించిన పరీక్షల్లో పాస్ అయిన వారికి శిక్షణ ఇస్తారు. ఆ సమయంలో రైలు ఇంజిన్ చిక్కులను అర్థం చేసుకోవాలి.
సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకున్న తరువాత, డివిజనల్ ఇంజనీర్ పరీక్షను తీసుకుంటారు రైల్వే శాఖ అధికారులు.
రైల్వే నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత భారత రైల్వేస్ నుండి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతంది.
ఇండియన్ రైల్వే శాఖ ఆధ్వర్యంలో అన్న పరీక్షల్లో పాస్ అయిన తరవాత ఇచ్చే సర్టిఫికేట్ వారికి లైసెన్స్‌గా పనిచేస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి