ప్రభుత్వ రంగ బ్యాంకు కొత్త స్కీమ్! తక్కువ వడ్డీకే గోల్డ్‌ రుణాలు..

కరోనా, లాక్‌డౌన్ కష్టకాలంలో చేతిలో డబ్బులేక, ఉపాధి లేక అవస్థలు పడుతున్నవారికి బంగారం భరోసానిస్తుంది..ఎమర్జెన్సీ అవసరాల కోసం తక్షణం డబ్బు అవసరం కలిగి ఉన్నవారి కోసం కొత్త గోల్డ్‌లోన్ స్కీమ్‌...

ప్రభుత్వ రంగ బ్యాంకు కొత్త స్కీమ్! తక్కువ వడ్డీకే గోల్డ్‌ రుణాలు..
Follow us

|

Updated on: May 26, 2020 | 1:10 PM

ఇంట్లో బంగారం ఉంటే,..అది అన్ని వేళలా ఆదుకుంటుందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం నెలకొన్న కరోనా, లాక్‌డౌన్ కష్టకాలంలో చేతిలో డబ్బులేక, ఉపాధి లేక అవస్థలు పడుతున్నవారికి బంగారం భరోసానిస్తుంది. అత్యవసర సమయం, పర్సనల్ లోన్ కూడా దొరకని టైమ్‌లో చాలా మంది గోల్డ్‌లోన్‌ అవకాశాన్ని ఎంచుకుంటారు. అయితే, ఇప్పుడు..ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంక్ కెనరా బ్యాంక్..ఇప్పుడు కొత్తగా గోల్డ్ లోన్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అవసరమైన వారు సులభంగా లోన్ తీసుకునే అవకాశం కల్పించింది. త్వరితగతిన రుణం వస్తుంది. వడ్డీ రేట్లు కూడా తక్కువగానే ఉన్నాయని, కావాల్సినవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ డి.విజయ్ కుమార్ సూచించారు.

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రజలు, ఖాతాదారులు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ అవసరాల కోసం తక్షణం డబ్బు అవసరం కలిగి ఉన్నవారి కోసం కొత్త గోల్డ్‌లోన్ స్కీమ్‌ని తీసుకొచ్చామని చెప్పారు. గోల్డ్ లోన్‌పై 7.85శాతం వడ్డీ పడుతుందని చెప్పారు. దేశవ్యాప్ంగా ఉన్న అన్ని కెనరా బ్యాంక్ బ్యాంచుల్లోనూ గోల్డ్‌లోన్ కోసం అప్లై చేసుకోవచ్చని తెలిపారు. తీసుకున్న రుణం ఏడాది నుంచి మూడేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ డి. విజయ్ కుమార్ స్పష్టం చేశారు.