టీమిండియా కోచ్‌గా దాదా.. అసలు ట్విస్ట్ ఇదే!

కోల్‌కతా: ప్రస్తుతం బీసీసీఐ టీమిండియాకు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్న రవిశాస్త్రికే రెండోసారి కూడా ఆ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోహ్లీ, రవిశాస్త్రి మధ్య సఖ్యత.. టీమిండియా అద్భుతమైన ఫలితాలు ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా దాదా సౌరవ్ గంగూలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు టీమిండియాకు […]

టీమిండియా కోచ్‌గా దాదా.. అసలు ట్విస్ట్ ఇదే!
Follow us

|

Updated on: Aug 03, 2019 | 12:00 AM

కోల్‌కతా: ప్రస్తుతం బీసీసీఐ టీమిండియాకు కొత్త కోచ్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్న రవిశాస్త్రికే రెండోసారి కూడా ఆ పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోహ్లీ, రవిశాస్త్రి మధ్య సఖ్యత.. టీమిండియా అద్భుతమైన ఫలితాలు ఇందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉండగా దాదా సౌరవ్ గంగూలీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు టీమిండియాకు కోచ్ అవుతానని గంగూలీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తనకు కోచ్ పదవిపై ఆసక్తి ఉందని.. భవిష్యత్తులో కోచ్ పదవికి తప్పకుండా దరఖాస్తు చేస్తానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సలహాదారుడిగా, బెంగాల్ క్రికెట్ అసోషియేషన్‌కి అధ్యక్షుడిగా ఉన్నానన్న గంగూలీ.. ఈ బాధ్యతలు అన్ని పూర్తయ్యాక ఖచ్చితంగా టీమిండియా కోచ్ రేస్‌లోకి వస్తానని అన్నాడు.