Breaking News
  • భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. కరోనాపై పోరులో భారత్‌ చేయాల్సిందంతా చేస్తోంది. సాయం చేయడానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది. కరోనా వైరస్‌ను కలిసికట్టుగా ఎదుర్కొంటాం-ప్రధాని మోదీ.
  • ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రశంసలు. కరోనాపై యుద్ధంలో భారతీయుల కృషి అభినందనీయం. భారత ప్రధాని మోదీకి నా ధన్యవాదాలు-ట్రంప్‌ ట్వీట్‌.
  • కృష్ణాజిల్లా: మచిలీపట్నంలో గుండెపోటుతో వ్యక్తి మృతి. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తికి సోదరుడు కావడంతో.. స్థానికుల్లో పలు అనుమానాలు. మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలింపు. శాంపిల్స్‌ పరీక్షించే వరకు మృతదేహం ఇవ్వమంటున్న అధికారులు.
  • తెలంగాణలో డయల్‌ 100కు పెరుగుతున్న కాల్స్‌. లాక్‌డౌన్‌ తర్వాత డయల్‌ 100కు 13,34,330 కాల్స్‌. ఎమర్జెన్సీ కాల్స్‌-82,014. కోవిడ్‌ సస్పెక్ట్ కాల్స్‌- 2,710. లాక్‌డౌన్‌ కాల్స్‌-21,758. ఇన్‌ ఎఫెక్టివ్‌ కాల్స్‌-87,665. విచారణ కోసం చేసిన కాల్స్‌- 84,123. తగ్గిన చోరీలు, గృహ హింస, రోడ్డుప్రమాదాల కాల్స్‌.
  • తెలంగాణలో క్రైమ్‌ రేట్‌ తగ్గింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో క్రైమ్‌రేట్‌ భారీగా పడిపోయింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రైమ్‌రేటు 56 శాతానికి పడిపోవడం ఊరటనిస్తోంది. లాక్‌డౌన్‌తో దొంగతనాలు పూర్తిగా తగ్గిపోయాయి.

వెన్న తీసిన పాలు తాగితే.. నాలుగేళ్ల యవ్వనం సొంతమట!

Skimmed milk gives us everlasting young, వెన్న తీసిన పాలు తాగితే.. నాలుగేళ్ల యవ్వనం సొంతమట!

వెన్న తీసినపాలను (స్కిమ్డ్‌ మిల్క్) తాగితే నిత్య యవ్వనంగా ఉండవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఏంటి అవాక్కయ్యారా? అది నిజమేనట. దీన్ని సైంటిఫిక్‌గా ఫ్రూవ్ కూడా చేశారు బ్రిగమ్ యూనివర్శిటీ వైద్యులు. అంతేకాదు ఈ పాలను తాగడం వల్ల.. వృద్ధాప్య ఛాయలు కూడా తొందరగా రావట. నాలుగున్నర ఏళ్ల వయసు కూడా తగ్గుతుందని వారు పేర్కొంటున్నారు. మరి వెన్న తీసిన పాలను తాగవచ్చా? వాటి వల్ల ఉపయోగాలేంటి? ప్రమాదాలేంటో తెలుసుకుందాం.

లో కార్బ్, లో ఫ్యాట్ ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాటలు. అందుకు చాలా మంది వెన్న తీసిన పాలు, కొవ్వు తీసిన పాలనే ఎక్కువగా తాగుతున్నారు. అయితే.. కొవ్వు, వెన్న కూడా శరీరానికి చాలా ముఖ్యం. మరీ వీటిని తగ్గించేస్తే.. కొన్ని ప్రొటీన్లు శరీరానికి అందవు. దీంతో చాలా సమస్యలు వస్తాయి. అయితే వెన్న తీసిన పాలకి, కొవ్వు తీసిన పాలకి చాలా తేడా ఉంటుంది. ఇందులో వెన్న తీసిన పాలను రోజూ తాగుతూంటే.. నిత్య యవ్వనం సొంతమవుతుందట. అదెలాగో తెలుసుకోండి.

Skimmed milk gives us everlasting young, వెన్న తీసిన పాలు తాగితే.. నాలుగేళ్ల యవ్వనం సొంతమట!దాదాపు 6 వేల మందిపై బ్రిటన్‌కి చెందిన బ్రిగమ్ యూనివర్సిటీ వైద్యులు 5 సంవత్సరాలు పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. స్కిమ్డ్ మిల్క్ తాగడం వల్ల డీఎన్‌లో మార్పులు వస్తాయట. దాని కారణంగా వృద్ధాప్య ఛాయలు మందగిస్తాయట. కొవ్వు ఉన్న పాలు తాగితే.. మన శరీరంలోని టెలోమీర్‌లు అనేవి చిన్నవిగా అయిపోతాయట. ఇవి అలా అవడం వల్ల మన డీఎన్‌ఎ అస్థిరంగా మారుతుంది. దీంతో ఆరోగ్యకరమైన యవ్వన కణజాలాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అలాగే.. ధూమపానం, మద్యపానం చేసే వారిలో కూడా టెలోమీర్‌లు తగ్గిపోతాయట.

‘టెలోమీర్’ అనేది క్రోమోజోమ్‌ల ప్రతి చివరలో పునరావృతమయ్యే న్యూక్లియోటైడ్ సీక్వెన్సుల ప్రాంతం. ఇది క్రోమోజోమ్స్‌ క్షీణించకుండా లేదా పొరుగు క్రోమోజోమ్‌లతో కలయిక నుండి రక్షిస్తుంది.

కాగా.. వెన్న ఉన్న పాలను తీసుకోవడం ద్వారా గుండెకి సంబంధించిన జబ్బులు, షుగర్ తదితర వ్యాధులు వచ్చే ప్రమాదముందని వారు కనుగొన్నారు. అలాగని పూర్తిగా కొవ్వు పదార్థాలను తీసుకోకుండా ఉండకూడదు. కాగా.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం రోజువారీగా.. మనకు 50-60 శాతం కార్పొహైడ్రేట్లు, 30 శాతం ప్రోటీన్లు, కేవలం 10 శాతం కొవ్వులు అవసరమంటున్నారు వైద్యులు.

Skimmed milk gives us everlasting young, వెన్న తీసిన పాలు తాగితే.. నాలుగేళ్ల యవ్వనం సొంతమట!

Related Tags