శభాష్ షోయబ్.. ఆర్టికల్ 370 రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యాలు

జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాక్, భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సహా ఆ దేశానికి చెందిన ఎంతోమంది తీవ్రమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే పాక్ క్రికెట్ ప్లేయర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తాను చెప్పాలనుకున్నది చెప్పాడు. ” ఇరు దేశాల పరిస్థితి ఏమీ బాగాలేదు నాకు తెలుసు. మీరు మీ […]

శభాష్ షోయబ్..  ఆర్టికల్ 370 రద్దుపై ఆసక్తికర వ్యాఖ్యాలు
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 11:13 PM

జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయంతో పాక్, భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సహా ఆ దేశానికి చెందిన ఎంతోమంది తీవ్రమైన విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే పాక్ క్రికెట్ ప్లేయర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా తాను చెప్పాలనుకున్నది చెప్పాడు.

” ఇరు దేశాల పరిస్థితి ఏమీ బాగాలేదు నాకు తెలుసు. మీరు మీ దేశాన్ని ప్రేమించినట్టే.. మా దేశాన్ని మేము ప్రేమిస్తాం. కానీ ఎవ్వరూ విద్వేషాలకు కారణం కారాదు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత,ఆందోళనలను మరింత పెంచేలా వ్యాఖ్యలు చేయవద్దు. పరిస్థితి చేజారిపోకుండా చూడండి అంటూ తన వ్యాఖ్యానించాడు”. ఇరు దేశాల్లో ఆర్టికల్ 370 రద్దు తీవ్ర ఉద్రిక్తతలకు కారణమవుతున్న పరిస్థితుల్లో షోయబ్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.