నేడు ఈడీ ముందుకు శరద్ పవార్.. ముంబైలో 144 సెక్షన్

ముంబై నగరంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు స్వచ్ఛందంగా వస్తున్నారు. దీంతో ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిషేధ ఉత్తర్వులు విధించారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఈడీ కార్యాలయానికి శరద్ పవార్ రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు […]

నేడు ఈడీ ముందుకు శరద్ పవార్.. ముంబైలో 144 సెక్షన్
Follow us

| Edited By:

Updated on: Sep 27, 2019 | 9:34 AM

ముంబై నగరంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఎన్సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ మహారాష్ట్ర సహకార బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణకు స్వచ్ఛందంగా వస్తున్నారు. దీంతో ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు నిషేధ ఉత్తర్వులు విధించారు. మధ్యాహ్నం 2.00 గంటలకు ఈడీ కార్యాలయానికి శరద్ పవార్ రానున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే పరోలా, ముక్తాయ్ నగర్, ఉస్మానాబాద్ పట్టణాల్లో ఎన్సీపీ కార్యకర్తలు బంద్‌కు పిలుపునిచ్చారు. ముంబై నగరంలోని కొలబా, కుఫీ పరేడ్, మెరెన్ డ్రైవ్, ఆజాద్ మైదాన్, డోంగ్రీ, జేజే మార్గ్, ఎమ్మారే మార్గ్ ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడమే కాకుండా.. భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Latest Articles
ఈ అందాల చందమామకు అవకాశాలు మాత్రమే అందని ద్రాక్షే..
ఈ అందాల చందమామకు అవకాశాలు మాత్రమే అందని ద్రాక్షే..
'ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక'.. మాజీ మంత్రి
'ఇది తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నిక'.. మాజీ మంత్రి
వేసవిలో మట్టి కుండలో నీళ్లు చల్లగా మారాలంటే.. ఇలా చేసి చూడండి!
వేసవిలో మట్టి కుండలో నీళ్లు చల్లగా మారాలంటే.. ఇలా చేసి చూడండి!
‘లైన్‌ మ్యాన్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడో తెల్సా..?
‘లైన్‌ మ్యాన్‌’ స్ట్రీమింగ్‌ ఎక్కడో తెల్సా..?
బాక్స్‌ క్రికెట్‌.. ఇప్పుడిది ట్రెండీ బిజినెస్‌
బాక్స్‌ క్రికెట్‌.. ఇప్పుడిది ట్రెండీ బిజినెస్‌
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
టెస్టుల్లో టీమిండియా నంబర్ వన్ ర్యాంక్ గోవిందా! అందులో మాత్రం..
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌.. మిడ్‌ రేంజ్‌ బడ్జెట్‌లోనే
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. హైకోర్టు కీలక సూచన..
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
'రోహిత్‌ వేముల దళితుడు కాదు.. ఈ కేసును మూసి వేస్తున్నాం' హైకోర్టు
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..
అమెజాన్‌ సేల్‌లో బెస్ట్‌ డీల్స్‌ ఇవే.. రూ. 8వేలలోనే ఫోన్స్..