బ్రేకింగ్ః నిలిచిపోయిన ఎస్‌బీఐ ‘నెట్‌’ సేవలు

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలకు మంగళవారం అంతరాయం ఏర్పడింది.

బ్రేకింగ్ః నిలిచిపోయిన ఎస్‌బీఐ 'నెట్‌' సేవలు
Follow us

|

Updated on: Oct 13, 2020 | 1:54 PM

దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్‌ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ) ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌ సేవలకు మంగళవారం అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి బ్యాంక్‌ సర్వర్లు మొరాయించడంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు నిలిచిపోయాయి. మరోవైపు ఎస్‌బీఐ ప్రత్యేక ఇంటర్‌నెట్‌ సేవల యాప్‌ యోనో కూడా పని చేయలేదు. దీంతో ఖాతాదారులు తమ అకౌంట్స్‌కు లాగిన్‌ కాలేకపోయారు. దీంతో మొబైల్‌ బ్యాంకింగ్‌ సేవలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఆన్‌లైన్‌ ద్వారా నగదు బదిలీలు కాకపోవడంతో చాలా మంది కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. యోనో యాప్‌ కూడా పనిచేయట్లేదు. కాగా.. కనెక్టివిటీలో లోపం కారణంగా సేవలకు అంతరాయం కలిగిందని ఎస్‌బీఐ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

కొన్ని గంటల తరువాత ఆలస్యంగా మేలుకొన్న వివరణనిస్తూ సాంకేతిక కారణాల వల్ల ఇంటర్‌నెట్‌ సేవలకు అంతరాయం కలుగుతోందని.. త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్టుగా తెలిపింది. ‘కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో కనెక్టివిటీ సమస్య తలెత్తింది. దీంతో ఆన్‌లైన్‌ సేవలు నిలిచిపోయాయి. ఏటీఎం, పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ మెషీన్లు మినహా అన్ని ఛానళ్లు ఆగిపోయాయి. అంతరాయానికి చింతిస్తున్నాం. త్వరలోనే సేవలను పునరుద్ధరిస్తాం. ఇలాంటి సమయంలో కస్టమర్లు అండగా నిలవాలని కోరుకుంటున్నాం’ అని ఎస్బీఐ ట్వీటర్‌లో పేర్కొంది. అయితే, ఎస్‌బీఐ లాంటి పెద్ద బ్యాంక్‌ ఇంటర్‌నెట్‌ సేవలకు విఘాతం కలుగడం అందరినీ అశ్చర్యపరిచింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు