అవన్నీ ఫేక్ వార్తలే.. ఎస్‌బీఐ ఫైర్!!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై.. పలు రకాల వార్తలు ఇప్పటికే చాలా వచ్చాయి. వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీలు మార్చడంపై ఇటీవలే పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విత్‌‌డ్రాలు, ఏడాదికి 40 క్యాష్ డిపాజిట్స్, నెలకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫ్రీ.. అనే వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి కూడా. అయితే.. ఈ పుకార్లపై ఎస్‌బీఐ స్పందించింది. ఈ విషయాలకు సంబంధించి.. ఎస్‌బీఐ బ్యాంక్ ట్విట్టర్‌లో తాజా విషయాలను వెల్లడించింది. ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతోన్న.. […]

అవన్నీ ఫేక్ వార్తలే.. ఎస్‌బీఐ ఫైర్!!
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 5:28 PM

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై.. పలు రకాల వార్తలు ఇప్పటికే చాలా వచ్చాయి. వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీలు మార్చడంపై ఇటీవలే పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విత్‌‌డ్రాలు, ఏడాదికి 40 క్యాష్ డిపాజిట్స్, నెలకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫ్రీ.. అనే వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి కూడా. అయితే.. ఈ పుకార్లపై ఎస్‌బీఐ స్పందించింది. ఈ విషయాలకు సంబంధించి.. ఎస్‌బీఐ బ్యాంక్ ట్విట్టర్‌లో తాజా విషయాలను వెల్లడించింది.

ప్రస్తుతం ఇప్పుడు వైరల్ అవుతోన్న.. నెలకు పరిమిత డిపాజిట్లు, వడ్డీ రేట్లు, ఏటీఎం ట్రాన్సాక్షన్స్, ఆర్‌బీఐ న్యూ రూల్స్ ఇలా అన్ని వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. కాగా.. అక్టోబర్ 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు అమలులోకి వస్తున్న మాట మాత్రం నిజమే కానీ.. మిగిలినవన్నీ అవాస్తవాలని కొట్టిపారేసింది. మిగిలిన విషయాలకు సంబంధించి.. ట్వీట్టర్‌లొ ఓ లెటర్‌ పోస్ట్ చేసింది.

1. క్యాష్‌ డిపాజిట్స్: నెలకు 3, సంవత్సరానికి 36 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ 2. క్యాష్ విత్‌డ్రాయల్: నెలకు 2, సంవత్సరానికి 24 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ 3. ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్: నెలకు 5, సంవత్సరానికి 60 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ 4. ఇతర ఏటీఎంలో ట్రాన్సాక్షన్స్: నెలకు 3, సంవత్సరానికి 60 ట్రాన్సాక్షన్స్ ఫ్రీ

ఇంతకు మించి.. ఎక్స్‌ ట్రా ట్రాన్సాక్షన్స్ చేస్తే.. ఛార్జీలు వసూలు చేస్తామని పేర్కొంది.