భారీ డిస్కౌంట్స్ తో ‘రూపే ఫెస్టివ్‌ కార్నివాల్‌’ బంపర్ ఆఫర్

పండుగవేళ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ‘రూపే ఫెస్టివ్‌ కార్నివాల్‌’ పేరిట మరో ఆఫర్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది.

  • Balaraju Goud
  • Publish Date - 10:03 pm, Mon, 26 October 20

పండుగవేళ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఆయా సంస్థలు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ‘రూపే ఫెస్టివ్‌ కార్నివాల్‌’ పేరిట మరో ఆఫర్ కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. భారత జాతీయ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) రూపే కార్డు వినియోగదారులకు డిస్కౌంట్లు ప్రకటించింది. అంత ఇంత కాదు, ఏకంగా వివిధ బ్రాండ్ల ఉత్పత్తుల కొనుగోళ్లపై 65 శాతం డిస్కౌంట్లు పొందొచ్చని తెలిపింది. ‘రూపే ఫెస్టివ్‌ కార్నివాల్‌’ పేరిట ఈ డిస్కౌంట్లు ప్రకటించింది.

హెల్త్‌, ఫిట్‌నెస్‌, ఎడ్యుకేషన్‌, ఈ-కామర్స్‌, ఫుడ్‌ డెలివరీ, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫార్మసీకి సంబంధించిన కొనుగోళ్లపై డిస్కౌంట్లు లభించనున్నాయని ఎన్‌పీసీఐ పేర్కొంది. అమెజాన్‌, స్విగ్గీ, శాంసంగ్‌ వంటి ప్రముఖ బ్రాండ్ల నుంచి కొనుగోళ్లపై 10 నుంచి 65 శాతం వరకు డిస్కౌంట్లు పొందవచ్చని తెలిపింది. వరుస పండుగలను పురస్కరించుకుని వినియోగదారులను క్యాచ్ చేసేందుకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రయోజనాలు తమ కస్టమర్లు పొందగలరని ఆశిస్తున్నట్లు ఎన్‌పీసీఐ మార్కెటింగ్‌ చీఫ్‌ కునాల్‌ కలావాటియా పేర్కొన్నారు. డిజిటల్‌, కాంటాక్ట్ లెస్‌ పేమెంట్స్‌ను అందిపుచ్చుకుంటారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.