Breaking News
  • చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్య కేసు. ఫాతిమా లతీఫ్‌ ఆత్మహత్యపై విద్యార్థి సంఘాల ఆందోళనలు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పద్మనాభన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌. నేడు ఐఐటీ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు.
  • కరీంనగర్‌: అలుగునూరులో రోడ్డుప్రమాదం. లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. మృతులు సాయికిరణ్‌, సాయికృష్ణగా గుర్తింపు.
  • నిజామాబాద్‌: భీమ్‌గల్‌ మండలం లింబాద్రిగుట్ట జాతరలో ప్రమాదం. డ్యాన్సింగ్‌ వీలుపై నుంచి పడి రవి అనే వ్యక్తికి తీవ్రగాయాలు. నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలింపు.
  • ప్రభుత్వం 50 మంది కార్మికులను చంపేసింది. తప్పుడు విధానాలతో భవన నిర్మాణ కార్మికులు ఆకలితో చనిపోతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నా. వ్యక్తిగతంగా విమర్శించను.. తప్పుడు విధానాలపైనే ప్రశ్నిస్తున్నా. కార్మికుల కష్టాలను సీఎం జగన్‌ పట్టించుకోవాలి-పవన్‌కల్యాణ్‌.
  • విశాఖ: ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. అరకులో 13, చింతపల్లిలో 8, మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత. పాడేరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.
  • కర్నూలు: విజయానికేతన్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌, డైరెక్టర్‌ అరెస్ట్. సాంబార్‌ గిన్నెలో పడి విద్యార్థి మృతి చెందిన ఘటనలో అరెస్ట్‌. కరస్పాండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డైరెక్టర్ విజయకుమార్‌రెడ్డిని.. రహస్యంగా రిమాండ్‌కు తరలించిన పాణ్యం పోలీసులు. హాస్టల్‌కు అనుమతి లేదని తేల్చిన విద్యాశాఖ అధికారులు. ఇంత వరకు బయటకు రాని సీసీఫుటేజ్‌. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవంటున్న యాజమాన్యం.
  • హైదరాబాద్‌: మాదాపూర్‌లో రోడ్డుప్రమాదం. అయ్యప్ప సొసైటీలో అదుపుతప్పి స్కూల్‌ బస్సు బోల్తా. బస్సులో విద్యార్థులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం.

RRR: ఎన్టీఆర్ వచ్చేశాడు.. నెక్ట్స్ షెడ్యూల్ ఎక్కడంటే..!

RRR: Jr NTR back from Bulgeria, next schedule in Hyderabad

టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ కోసం ఇటీవల చిత్ర యూనిట్ బల్గేరియాకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ చిత్రీకరణలో భాగంగా ఎన్టీఆర్‌తో పాటు మరికొందరిపై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. తాజాగా ఈ షెడ్యూల్ ముగియడంతో ఆదివారం వారంతా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

అలాగే తదుపరి షెడ్యూల్‌ను నగరంలోనే ప్లాన్ చేశాడట రాజమౌళి. త్వరలో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుండగా.. అందులో రామ్ చరణ్ పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఈ షెడ్యూల్‌లో ఆమె కూడా భాగం కానుందని సమాచారం. కాగా ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జూలై 30న ఆర్ఆర్ఆర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ తరువాత రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందులోనూ ఇద్దరు టాప్ హీరోలతో జక్కన్న ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఆర్ఆర్ఆర్‌ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆర్ఆర్‌ఆర్ విడుదల కాబోతుంది.