‘సచిన్ కంటే రోహిత్‌శర్మ బెస్ట్ ఓపెనర్’
భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మపై ప్రశంసలు కురిపించాడు న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డాల్. వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కన్నా రోహిత్ బెస్ట్ ఓపెనర్ అని అభిప్రాయపడ్డాడు. “రోహిత్‌కు మ్యాచ్ సిట్యువేషన్స్ కు తగ్గట్లు, స్పీడ్ మారుస్తూ స్ట్రైక్‌రేట్‌ను పెంచుకునే కెపాసిటీ ఉంది. 60, 70, 80 పరుగుల దగ్గరే కాకుండా.. 90ల వద్ద స్ట్రస్ పీలవ్వకుండా రోహిత్ ఆడతాడు. ప్రజంట్ అతడి స్ట్రైక్‌రేట్ 88.93 ఉండగా, యావరేజ్ 49.27 ఉంది. అదే […]
భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్‌శర్మపై ప్రశంసలు కురిపించాడు న్యూజిలాండ్ మాజీ బౌలర్ సైమన్ డాల్. వన్డేల్లో క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ కన్నా రోహిత్ బెస్ట్ ఓపెనర్ అని అభిప్రాయపడ్డాడు.
“రోహిత్‌కు మ్యాచ్ సిట్యువేషన్స్ కు తగ్గట్లు, స్పీడ్ మారుస్తూ స్ట్రైక్‌రేట్‌ను పెంచుకునే కెపాసిటీ ఉంది. 60, 70, 80 పరుగుల దగ్గరే కాకుండా.. 90ల వద్ద స్ట్రస్ పీలవ్వకుండా రోహిత్ ఆడతాడు. ప్రజంట్ అతడి స్ట్రైక్‌రేట్ 88.93 ఉండగా, యావరేజ్ 49.27 ఉంది. అదే సచిన్ విషయానికొస్తే స్ట్రైక్‌రేట్ 86.24, యావరేజ్ 44.83 ఉన్నాయి. కాబట్టి సచిన్ కంటే రోహిత్ ముందు ఉన్నాడు. అందుకే రోహిత్ బెస్ట్ ఓపెనర్ అయ్యాడు” అని సైమన్ డాల్ పేర్కొన్నాడు.
అయితే వన్డే ఫార్మాట్లో ఫస్ట్ డబుల్ సెంచరీ సచిన్ నమోదు చేయగా, ఆ తర్వాత వరుసగా మూడు డబుల్ సెంచరీలు కొట్టి రికార్డు సృష్టించాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉన్న ఇతడు.. గతేడాది వన్డే ప్రపంచకప్‌లోనూ అదిరిపోయే గణాంకాలు నమోదు చేశాడు. ఐదు సెంచరీలు చేయడం సహా టోర్నీ చరిత్రలో ఓ సీజన్లో ఎక్కువ పరుగులు(648) చేసిన బ్యాట్స్‌మన్‌గా చరిత్ర లిఖించాడు.