కేంద్ర బడ్జెట్ ముందు.. 7 సవాళ్లు ..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ను పార్లమెంటులో సమర్పించనున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం మందగమనంలో ఉన్న ఆర్ధిక వృద్ది, నిరుద్యోగ సమస్య, క్రెడిట్ క్రంచ్, నిరరర్థక ఆస్థులవల్ల బ్యాంకులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఇది ఎలా ప్రస్తావిస్తుందో చూడాల్సి ఉంది. అసలే ఇటీవలి కాలంలో ప్రయివేటు పెట్టుబడులు చాలావరకు తగ్గాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి చాలావరకు తగ్గిపోయింది. పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కోసం కేటాయింపులు పెంచడం ద్వారా […]

కేంద్ర బడ్జెట్ ముందు.. 7 సవాళ్లు ..
Follow us

|

Updated on: Jul 04, 2019 | 12:53 PM

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన పూర్తి స్థాయి సాధారణ బడ్జెట్ ను పార్లమెంటులో సమర్పించనున్న నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం మందగమనంలో ఉన్న ఆర్ధిక వృద్ది, నిరుద్యోగ సమస్య, క్రెడిట్ క్రంచ్, నిరరర్థక ఆస్థులవల్ల బ్యాంకులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ఇది ఎలా ప్రస్తావిస్తుందో చూడాల్సి ఉంది. అసలే ఇటీవలి కాలంలో ప్రయివేటు పెట్టుబడులు చాలావరకు తగ్గాయి. వినియోగదారుల కొనుగోలు శక్తి చాలావరకు తగ్గిపోయింది. పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ కోసం కేటాయింపులు పెంచడం ద్వారా ఇన్వెస్టిమెంట్లకు మార్గాన్ని మరింత సుగమం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా నిరుద్యోగ సమస్యని ఈ బడ్జెట్ తప్పనిసరిగా స్పృశించాల్సి ఉంటుంది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (మౌలిక సదుపాయాల కల్పన), రియల్ ఎస్టేట్, పవర్ (విద్యుత్), వ్యవసాయం, పన్నుల వ్యవస్థ, ఉద్యోగాల కల్పన, బ్యాంక్ రీకేపిటలైజేషన్ రంగాల అభివృధ్దిని బడ్జెట్ హైలైట్ చేయాల్సి ఉంటుంది.

ఇన్ ఫ్రాస్ట్రక్చర్ …. దేశంలో రోడ్లు, హైవేల నిర్మాణం, భరత్ మల, సగర్మల వంటి కీలక ప్రాజెక్టుల పూర్తి, హైస్పీడ్ ట్రెయిన్స్ , మెట్రో కనెక్టివిటీని పెంచడం, పోర్టుల అభివృధ్దివంటివాటికి కేటాయింపులు పెంచాల్సి ఉంటుంది. ఫ్రెయిట్ కారిడార్ల అప్ గ్రేడేషన్, పన్ను విరామకాలం పొడిగింపు, భూసేకరణ నిబంధనల సరళీకరణ వల్ల ప్రయివేటు పెట్టుబడులు పెరగవచ్చు. టాక్స్ ఫ్రీ బాండ్లను జారీ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించవచ్ఛు. రియల్ ఎస్టేట్… రియల్ ఎస్టేట్ రంగంలో డెవలపర్లకు సింగిల్ విండో విధానాన్ని అమలు చేయడం, జీఎస్టీ కింద స్తాంప్ డ్యూటీ తగ్గించడం ద్వారా పెను భారాన్ని హేతుబధ్ధం చేయడం, స్థిరాస్తి రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం, ప్రత్యక్ష, పరోక్ష పన్నులు , ఇతరత్రా రుసుముల భారాన్ని తగ్గించడం ముఖ్యం.

పవర్.. విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో ట్రాన్స్ మిషన్లను పెంచడానికి గ్రీన్ కారిడార్ల అభివృధ్ది, గ్రిడ్ సిస్టం బలోపేతం, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సబ్సిడీలు ఇవ్వడం, డిస్కంలకు మరిన్ని నిధులు కేటాయించిన పక్షంలో విద్యుత్ రంగం మరింత ప్రగతి సాధించవచ్ఛు.

వ్యవసాయం… ఈ రంగానికి సంబంధించి గ్రామీణ స్థాయిలో మరిన్ని ఉద్యోగాల కల్పన, మైక్రో ఇరిగేషన్ వంటి కోల్డ్ స్టోరేజ్, నేషనల్ వేర్ హౌస్ గ్రిడ్, దీన్ దయాళ్ గ్రామీణ్ కౌశల్ వంటి పథకాల ద్వారా రైతుల జీవన స్థితిగతుల మెరుగుదలకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయపన్ను విషయంలో కార్పొరేట్ ఇన్ కమ్ టాక్స్ రేట్లను హేతుబధ్దం చేయాల్సి ఉంటుంది.

బడ్జెట్ మినహాయింపు పరిమితి 5 లక్షలకు, టాక్స్ స్లాబులను కూడా పెంచాల్సి ఉంటుంది. సెక్షన్ 80 సి కింద ఇన్వెస్టిమెంట్ల పరిమితులను కూడా పెంచవల్సిన అవసరం ఉంది. అలాగే సెక్షన్ 80 డీ కింద గృహ రుణాలపై వడ్డీని కూడా తగ్గించాల్సి ఉంటుంది. ఉద్యోగాల కల్పన, బ్యాంక్ రీ-కేపిటలైజేషన్ రంగాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవచ్ఛునని భావిస్తున్నారు. నిరరర్థక ఆస్తులతో తల్లడిల్లుతున్న బ్యాంకింగ్ రంగాన్ని ఆదుకునేందుకు సంస్కరణలు తప్పనిసరి..