కరోనా భయం.. జైల్లో అల్లర్లు.. 23 మంది మృతి..!

ప్రపంచం మొత్తాన్ని కరోనా బెంబేలెత్తిస్తోంది. తన పేరును తలచుకున్నా వెన్నులో వణుకు వచ్చేలా చేస్తోంది. అసలు ఎప్పుడు, ఎలా ఈ వైరస్ తమను అటాక్ అవుతుందేమోనని ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు

కరోనా భయం.. జైల్లో అల్లర్లు.. 23 మంది మృతి..!
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2020 | 5:16 PM

ప్రపంచం మొత్తాన్ని కరోనా బెంబేలెత్తిస్తోంది. తన పేరును తలచుకున్నా వెన్నులో వణుకు వచ్చేలా చేస్తోంది. అసలు ఎప్పుడు, ఎలా ఈ వైరస్ తమను అటాక్ అవుతుందేమోనని ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే కరోనా వ్యాప్తి చెందిందనే భయంతో కొలింబియాలో రాజధాని బొగోటాలో ఉన్న లావో మోడెలో జైల్లో ఆదివారం అల్లర్లు తలెత్తాయి. ఈ ఘటనలో 23 మంది ఖైదీలు మరణించగా.. 83 మంది గాయపడ్డారని కొలింబియా న్యాయ శాఖ మంత్రి మార్గరీటా కాబెల్లో తెలిపారు. 32 మంది ఖైదీలు, ఏడుగురు గార్డులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు.

కాగా జైళ్లన్నీ ఖైదీలతో నిండుగా ఉన్నాయని, ఆరోగ్య సేవలు ఏ మాత్రం బాగోలేవని ఆదివారం కొలింబియా వ్యాప్తంగా జైళ్లలో ఖైదీలు ఆందోళనకు దిగారు. దీంతో అల్లర్లు జరిగాయి. దీనిపై కాబెల్లో మాట్లాడుతూ.. జైళ్లన్నీ పరిశుభ్రంగానే ఉన్నాయని.. ఖైదీలకు గానీ, సిబ్బందికి గానీ కరోనా సోకలేదని అన్నారు. ఈ హింసాత్మక ఘటనలకు ముందుగానే ప్లాన్ చేశారని.. గొడవకు దిగిన ఖైదీలపై హత్యాయత్నం, ఆస్తుల విధ్వంసం కేసులు పెడతామని హెచ్చరించారు.

Read This Story Also: షాకింగ్.. రెండుసార్లు నెగిటివ్.. మూడోసారి పాజిటివ్‌.. అసలేం జరిగింది..!