గుడ్‌న్యూస్: వినియోగదారులకు ఆర్బీఐ పండగ ఆఫర్

RBI మరోసారి రేట్‌ కట్‌కే మొగ్గు చూపింది. గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల MPC సమావేశం తరువాత 2019-20 సంవత్సరానికి సమీక్షను వెల్లడించింది. విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే కీలక వడ్డీరేటు 25 BPS పాయింట్ల మేర తగ్గించింది. ఏకగ్రీవంగా కమిటీ ఈ రేట్‌ కట్‌కు నిర్ణయించింది. ఈ ఏడాదిలో ఇది ఐదవ రేటు కట్‌. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగొచ్చింది. దీంతో రెపో రేటు 2010 నాటికి చేరింది. ఇక […]

గుడ్‌న్యూస్: వినియోగదారులకు ఆర్బీఐ పండగ ఆఫర్
Follow us

| Edited By:

Updated on: Oct 04, 2019 | 3:58 PM

RBI మరోసారి రేట్‌ కట్‌కే మొగ్గు చూపింది. గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన సమావేశమైన ఆరుగురు సభ్యుల MPC సమావేశం తరువాత 2019-20 సంవత్సరానికి సమీక్షను వెల్లడించింది. విశ్లేషకులు అంచనా వేసినట్టుగానే కీలక వడ్డీరేటు 25 BPS పాయింట్ల మేర తగ్గించింది. ఏకగ్రీవంగా కమిటీ ఈ రేట్‌ కట్‌కు నిర్ణయించింది. ఈ ఏడాదిలో ఇది ఐదవ రేటు కట్‌. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగొచ్చింది. దీంతో రెపో రేటు 2010 నాటికి చేరింది. ఇక రివర్స్‌ రెపో రేటును 4.9శాతంగా ఉంచింది. GDP వృద్ధిరేటును 6.9 నుంచి 6.1 నుంచి తగ్గించింది. అలాగే 2020-21 నాటికి జీడీపీ అంచనాను కోత పెట్టి 7.2 శాతంగా ఆర్‌బీఐ నిర్ణయించింది.

సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే రెపో రేటును వరుసగా నాలుగు సార్లు తగ్గించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ రేటే రెపో. జనవరి నుంచి వరుసగా నాలుగు ద్వైమాసిక సమీక్షల్లో రెపో రేటును ఆర్‌బీఐ 1.1 శాతం తగ్గించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం నేపథ్యంలో RBI వరుస రెపో రేట్ల కోతకు ప్రాధాన్యత ఇస్తోంది. తాజా రివ్యూలో MPCలో ఒక సభ్యుడు కూడా 40శాతం కోతకు ఓటు వేయడం గమనార్హం.