ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంకు కనుమరుగు..మ‌రో ఐదు బ్యాంకులు..

బ్యాంకుల విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే నెల 1వ‌ తేదీ నుంచి బ్యాంకుల సంఖ్య తగ్గనుంది. బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది...

ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రాబ్యాంకు కనుమరుగు..మ‌రో ఐదు బ్యాంకులు..
Follow us

|

Updated on: Mar 30, 2020 | 12:16 PM

బ్యాంకుల విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. దీంతో వచ్చే నెల 1వ‌ తేదీ నుంచి బ్యాంకుల సంఖ్య తగ్గనుంది. బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోప్రకటించిన బ్యాంకుల విలీనం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. దీంతో బ్యాంకుల సంఖ్య 10 నుంచి 4కు తగ్గుతుంది.

ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి. అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్‌బీ బ్రాంచులుగా పనిచేస్తాయి. సిండికేట్ బ్యాంక్ బ్రాంచులు కెనరా బ్యాంక్ బ్రాంచులుగా మారతాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులుగా రూపాంతరం చెందుతాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచులుగా పనిచేస్తాయి.

విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి 7 పెద్ద బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. 2017లో దాదాపు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరిస్తుంది. ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంక్‌గా కొనసాగుతోంది. ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూడో అతిపెద్ద బ్యాంక్ అవుతుంది. దీని తర్వాతి స్థానంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఉంటాయి. ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ అనేవి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు.