రంగంలోకి జియో మార్ట్.. ఇక నుంచి ఇంటికే కిరాణా సామాను..

దిగ్గజ ఆన్ లైన్ డెలివ‌రీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టుల‌కు పోటీగా రిల‌య‌న్స్ సంస్థ జియో మార్ట్ పేరుతో రంగంలోకి దిగింది. రిల‌య‌న్స్ జియో మార్ట్ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చేసింది. ప్ర‌త్యేక డిస్కౌంట్స్,

రంగంలోకి జియో మార్ట్.. ఇక నుంచి ఇంటికే కిరాణా సామాను..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 24, 2020 | 1:33 PM

JioMart: దిగ్గజ ఆన్ లైన్ డెలివ‌రీ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్టుల‌కు పోటీగా రిల‌య‌న్స్ సంస్థ జియో మార్ట్ పేరుతో రంగంలోకి దిగింది. రిల‌య‌న్స్ జియో మార్ట్ వెబ్‌సైట్ అందుబాటులోకి వచ్చేసింది. ప్ర‌త్యేక డిస్కౌంట్స్, ఆఫ‌ర్ల‌తో ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చేసింది. కూరగాయలు, పాలతో పాటు కిరాణా సామాను ఆర్డర్ చేస్తే ఏకంగా ఇంటికే వచ్చేస్తాయి. పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మీ ఏరియాలో డెలివరీ ఉందా? లేదా? అనేది తెలుస్తుంది.

మరోవైపు.. ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం ముంబైలోని కొన్ని ప్రాంతాల‌కే ప‌రిమితం అయిన రిల‌య‌న్స్ జియో మార్ట్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా త‌న సేవ‌ల‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్ర‌స్తుతానికి పండ్లు, కూర‌గాయాలు, ఇంటికి సంబంధించిన నిత్య‌వ‌స‌ర వ‌స్తువులు అందుబాటులో ఉన్నాయి. రూ.750 కంటే ఎక్కువ షాపింగ్ చేస్తే డెలివరీ ఛార్జ్ ఉండదు.

కాగా.. ‘జియో మార్ట్’ సేవలను ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అనుబంధ సంస్థ అయిన వాట్సప్‌లో అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద కేవలం ముంబయిలోని నేవీ ముంబయి, థానే, కల్యాణ్ వంటి ప్రాంతాల్లోనే ఈ సేవలు లభిస్తున్నాయి.