ఆ కారణంతోనే ‘సాహో’ నుంచి తప్పుకున్నాం – శంకర్ మహదేవన్

Shankar Ehasan Loy, ఆ కారణంతోనే ‘సాహో’ నుంచి తప్పుకున్నాం – శంకర్ మహదేవన్

ప్రభాస్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. సంగీత త్రయం శంకర్, ఎహసాన్, లోయ్‌లు సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఎందుకు తప్పుకున్నాం అనే విషయాన్ని మాత్రం శంకర్ మహదేవన్ ఇవాళ మీడియాతో పంచుకున్నారు.

సాహో నిర్మాతలు బయటనుంచి కొంతమంది కంపోజర్లతో మరికొన్ని పాటలు చేయించాలనుకున్నారు. ఆ విషయం మాకు కాస్త అసౌకర్యం కలిగించింది. తాము అప్పటికే పాటలను కంపోజ్ చేసే పనిలో ఉన్నాం. అప్పుడు ఈ విషయాన్ని సడన్‌గా నిర్మాతలు చెప్పడంతో తమకు నచ్చక బయటకు వచ్చేశామని తెలిపారు.

ఒక సినిమాకు సంగీతం అందించే వ్యక్తి ఒకరే ఉండాలి. అప్పుడే స్క్రీన్‌పై సంగీతం అందించిన వ్యక్తి పేరే వస్తుంది.. దానితో అతడు అది చూసి గర్వంగా ఫీలవుతాడు. అలా కాకుండా పదిమందితో కలిసి పనిచేయడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. అందుకే నచ్చక తప్పుకున్నామని శంకర్ మహదేవన్ ప్రకటించాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *