Breaking News
  • ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. వైద్య పరీక్షల కోసం గుంటూరు మెడికల్‌ కాలేజీలో కరోనా ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు అధికారులు.
  • మందు తాగితే తూలడం, మందు లేకపోతే మతిస్థిమితం కోల్పోయినట్టుగా ప్రవర్తించడం.. ఇదే ఇప్పుడు అంతటా కనిపిస్తోంది.. కరోనా కాలంలో మందుబాబుల కష్టాలు అన్నీఇన్నీ కావు.. మద్యం దుకాణాలన్నీ బంద్‌.. బార్లు పబ్బులు బంద్‌.. తాగి తాగి పిచ్చెక్కిపోయిన మందుబాబులు చివరకు దొంగలుగా మారిపోయారు.
  • తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. వెల్లూరు, తేంగాశి, కల్లకురిచి జిల్లాలలో పెరుగుతోన్న కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. తమిళనాడులో 411 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 64 మంది నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారే కావడం గమనార్హం.
  • కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంటి నుంచి బయటకు వెళితే మాస్క్‌ తప్పనిసరిగా వాడాలని కేంద్రం తెలిపింది. ఈ నియమాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందనని రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసు శాఖలను ఆదేశించింది.
  • లాక్‌డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌. అనవసరంగా రోడ్డు మీదకొస్తే వాహనాలు సీజ్‌ చేస్తామన్నారు.

తొలిసారిగా… ఐపీఎల్ టీం లోకి మహిళ!

RCB Becomes First IPL Team to Appoint Woman Support Staff, తొలిసారిగా… ఐపీఎల్ టీం లోకి మహిళ!

ఐపీఎల్‌‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఫ్రాంఛైజీ తమ జట్టు సహాయక బృందంలో ఓ మహిళను నియమించుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో ఇలా మహిళకు అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. ఆర్సీబీ జట్టు తమ అధికారిక ట్విటర్‌లో గురువారం రాత్రి ఈ విషయాన్ని వెల్లడించింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌కు నవ్‌నీతా గౌతమ్‌ అనే మసాజ్‌ థెరపిస్ట్‌ను నియమించుకున్నామని, ఆటగాళ్లకు అవసరమైన ఫిజియో సంబంధిత అంశాలను ఆమె పర్యవేక్షిస్తారని తెలిపింది. కాగా ఐపీఎల్‌ల్లో ఒక మహిళని సహాయక బృందంలో చేర్చుకున్న తొలి జట్టుగా ఆర్సీబీ గర్వపడుతుందని పేర్కొంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేక నైపుణ్య సాధనాలు చేయించడం, మోటివేషన్‌ కలిగించడంతో పాటు శారీరక గాయాలకు సంబంధించిన చికిత్స అందించడం ఆమె పని. ఈ విషయంపై స్పందించిన ఆర్సీబీ ఛైర్మన్‌ సంజీవ్‌ చురివాలా.. ఒక చారిత్రక ఘట్టంలో భాగస్వామి అయినందున తనకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆటలో మహిళా ప్రధాన్యాన్ని గుర్తించి సహాయక బృందాల్లోనూ వారికి అవకాశమివ్వడం అతి ముఖ్యమన్నారు. అన్ని క్రీడా విభాగాల్లో మహిళల భాగస్వామ్యంతో పాటు వారు సాధిస్తున్న విజయాలే నవ్‌నీతా ఎంపికకు కారణమని ఆయన వెల్లడించారు.

Related Tags