వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ కీలక ప్రకటన

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించింది. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించింది.

వడ్డీ రేట్లలో ఆర్‌బీఐ కీలక ప్రకటన
Follow us

|

Updated on: Oct 09, 2020 | 12:20 PM

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ శుక్రవారం ప్రకటించింది. రెపో రేటును 4శాతంగా, రివర్స్‌ రెపో రేటును 3.35శాతంగానే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది. దీంతో పాటు మరికొంతకాలం ‘అకామిడేటివ్‌’ విధానాన్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు.

కరోనాపై పోరులో భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం నిర్ణయాత్మక దశలోకి ప్రవేశించిందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం నాటికి ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టే అవకాశముందని అంచనా వేశారు. అప్పటికి జీడీపీ వృద్ధి రేటు కూడా పాజిటివ్‌ జోన్‌లోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. మూడో త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు గాడిలో పడతాయన్న ఆయన… ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద సరిపడా నగదు ఉందని వెల్లడించారు. భారత వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచేందుకు వచ్చే వారంలో రూ. 20,000 కోట్ల మేర ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రియల్‌ జీడీపీ వృద్ధిరేటు 9.5శాతం వరకు తగ్గే అవకాశముందన్నారు దాస్. కాగా, చివరిసారిగా మే 22న ఆర్‌బీఐ వడ్డీరేట్లలో మార్పులు చేసింది. రెపో రేటును అత్యంత కనిష్ఠంగా 4శాతానికి పరిమితం చేసింది ఆ తర్వాత ద్రవ్యోల్బణం నానాటికి పెరుగుతుండంతో మే తర్వాత నుంచి ఆర్‌బీఐ వడ్డీరేట్లను యథావిధిగా కొనసాగిస్తూ వస్తుంది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు