ఈ నెల 19న ‘రాయలసీమ ఎత్తిపోతల’ టెండర్‌ ఖరారు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంకు ఈ నెల 19న టెండర్ ఖరారు చేసి, పనులను ప్రారంభిస్తామని కర్నూల్ ప్రాజెక్ట్స్‌ సీఈ మురళీనాథ్ రెడ్డి తెలిపారు.

ఈ నెల 19న 'రాయలసీమ ఎత్తిపోతల' టెండర్‌ ఖరారు
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 8:10 AM

Rayalaseema Lift Irrigation: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంకు ఈ నెల 19న టెండర్ ఖరారు చేసి, పనులను ప్రారంభిస్తామని కర్నూల్ ప్రాజెక్ట్స్‌ సీఈ మురళీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన పనులను రూ.3,307.07 కోట్లకు సుభాష్‌ ప్రాజెక్ట్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ లిమిటెడ్‌ (ఎస్పీఎంఎల్‌) జాయింట్‌ వెంచర్‌ (జేవీ) దక్కించుకుంది.

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల టెండర్‌లో భాగంగా సీఈ మురళీనాథ్ రెడ్డి సోమవారం ‘ప్రైస్‌’ బిడ్‌ను తెరిచారు. అంతర్గత అంచనా విలువ రూ.3,278.18 కోట్ల కంటే 1.9 శాతం అధిక ధరకు ఎల్‌ 1 కోట్ చేసింది. ఇదే ధరను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి, సోమవారం మధ్యాహ్నం రివర్స్‌ టెండరింగ్‌ (ఈ–ఆక్షన్‌) నిర్వహించారు.  అందులో 0.88 శాతం అధిక ధరకు (రూ.3,307.07 కోట్లు)కు ఎస్పీఎంఎల్‌ (జేవీ) సంస్థ ఎల్‌–1ని కోట్ చేసి టెండర్‌ని దక్కించుకుంది. ఇక ఈ నివేదికను రాష్ట్ర స్థాయి సాంకేతిక కమిటీ (ఎస్‌ఎల్‌టీసీ)కి పంపుతామని మురళీనాథ్‌రెడ్డి వివరించారు. కాగా శ్రీశైలం జలాశయంలో వాటా నీటిని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో కరువును రూపుమాపాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీల చొప్పున నీళ్లు ఎత్తిపోసి.. తెలుగు గంగ, కేసీ కెనాల్, గాలేరు–నగరి, ఎస్సార్బీసీ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్రభుత్వం ప్రతిపాదించింది.

Read More:

తప్పుడు ఆరోపణలు వద్దు.. ఆధారాలుంటే రుజువు చేయండి

ప్రభాస్‌ బిగ్గెస్ట్‌‌ అనౌన్స్‌మెంట్‌.. ‌ ‘ఆది పురుష్’గా రెబల్‌స్టార్‌

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?