‘దేవ్’ కు జోడిగా రష్మిక..!

‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది రష్మిక మందన్నా. ఇటీవల రిలీజ్ అయిన ‘గీత గోవిందం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడిగా ‘డియర్ కామ్రేడ్’ లో నటిస్తోంది. దీనితో పాటు పలు కన్నడ చిత్రాలు కూడా నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈమె తమిళ హీరో కార్తీ సరసన ఒక చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందట. ‘దేవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో కార్తీ తన తదుపరి చిత్రాన్ని […]

'దేవ్' కు జోడిగా రష్మిక..!
Follow us

|

Updated on: Feb 23, 2019 | 10:09 AM

‘ఛలో’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది రష్మిక మందన్నా. ఇటీవల రిలీజ్ అయిన ‘గీత గోవిందం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం విజయ్ దేవరకొండకు జోడిగా ‘డియర్ కామ్రేడ్’ లో నటిస్తోంది. దీనితో పాటు పలు కన్నడ చిత్రాలు కూడా నటిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం ఈమె తమిళ హీరో కార్తీ సరసన ఒక చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైందట. ‘దేవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో కార్తీ తన తదుపరి చిత్రాన్ని ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్నా ను ఎంపిక చేశారని కోలీవుడ్ వర్గాల సమాచారం. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రాన్ని డ్రీం వారియర్ పిక్చర్స్ బ్యానర్ మీద ఎస్.కె.ప్రభు నిర్మించనున్నారు.