ప్రభాస్ థియేటర్‌.. చెర్రీకే ఆ ఛాన్స్

Ram Charan turns Chief Guest for Prabhas V Epiq, ప్రభాస్ థియేటర్‌.. చెర్రీకే ఆ ఛాన్స్

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టాడు. సూపర్‌స్టార్ మహేష్ బాబు దారిలో మల్టీపెక్స్‌ నిర్మాణంలోకి అడుగుపెట్టిన ప్రభాస్ నెల్లూరు జిల్లా సూళ్లూరు పేటలో వి ఎపిక్ పేరుతో భారీ మల్టీఫెక్స్‌ను నిర్మించాడు. ఇందులో యూవీ క్రియేషన్స్‌ నిర్మాతలు కూడా భాగస్వామ్యులుగా ఉన్నారు. ఏడున్నర ఎకరాల విస్తీర్ణంతో 40కోట్లతో ఈ మల్టీఫ్లెక్స్‌లో మూడు స్క్రీన్లను నిర్మించాలనుకోగా.. అందులో ఒక స్క్రీన్ నిర్మాణం ఇప్పుడు పూర్తైంది. ఇక ఈ థియేటర్ ఇవాళ ప్రారంభం కానుండగా.. దీని ప్రారంభోత్సవానికి సినీనటుడు రామ్ చరణ్ రానున్నాడు. యూవీ క్రియేషన్స్‌ నిర్మాతల్లో ఒకరైన వంశీ కృష్ణా రెడ్డికి చెర్రీ బెస్ట్‌ ఫ్రెండ్ కాగా.. అతడి కోరిక మేరకు రామ్ చరణ్ రాబోతున్నాడు. మరోవైపు సాహో ప్రమోషన్లలో ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల ఈ కార్యక్రమానికి గైర్హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

కాగా ఏసియాలోనే అతిపెద్ద స్క్రీన్ ఉండేలా దీనిని నిర్మించారు. 100 అడుగుల వెడల్పు 54 అడుగుల ఎత్తుగా ఇది ఉంబోతుంది. 4 కే రెజల్యూషన్‌తో ఈ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేశారు. 656 సీట్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌లో ప్రతీ సీట్ కింద సబ్ ఊఫర్ ఫిట్ చేసారు. ఇక మిగిలిన రెండు చిన్న స్క్రీన్లు 140 సీట్ల కెపాసిటీతో ఉండబోతున్నాయి. మొదటగా ప్రభాస్ సాహో చిత్రం ఇందులో ప్రదర్శించబడుతోంది.

Ram Charan turns Chief Guest for Prabhas V Epiq, ప్రభాస్ థియేటర్‌.. చెర్రీకే ఆ ఛాన్స్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *