వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీకి వర్షాలు

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి సోమవారానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఇది ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంతవరకు ఉంటుందనేది ఇంకా స్పష్టత రాలేదని వారు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సముద్రం చురుగ్గా ఉందని.. కోస్తాంధ్ర తీరం వెంబడి ఉన్న మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలోని ప్రజలు తగిన జాగ్రత్తలు […]

వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఏపీకి వర్షాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 02, 2019 | 5:06 PM

ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి సోమవారానికి తీవ్ర అల్పపీడనంగా మారింది. సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి ఇది ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఎంతవరకు ఉంటుందనేది ఇంకా స్పష్టత రాలేదని వారు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సముద్రం చురుగ్గా ఉందని.. కోస్తాంధ్ర తీరం వెంబడి ఉన్న మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతంలోని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. మరోవైపు దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం కూడా అల్పపీడనంతో కలిసి ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో నాలుగు రోజుల్లో కోస్తాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వారు వెల్లడించారు.