Breaking News
  • నెల్లూరు: సైదాపురం తహశీల్దార్‌ చంద్రశేఖర్‌ సస్పెన్షన్‌. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో చంద్రశేఖర్‌తో పాటు.. వీఆర్‌వోతో, తహశీల్దార్‌ ఆఫీస్‌ ఉద్యోగిని సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌.
  • టీవీ9కు అవార్డుల పంట. ఎక్సేంజ్‌ ఫర్‌ మీడియా న్యూస్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ అవార్డుల్లో.. టీవీ9కు మూడు అవార్డులు. పుల్వామా దాడి కవరేజ్‌కు బెస్ట్ న్యూస్ కవరేజ్ అవార్డు అందుకున్న.. విజయవాడ బ్యూరో చీఫ్‌ హసీనా. మరో రెండు విభాగాల్లో టీవీ9కు అవార్డులు. బిగ్‌ న్యూస్‌ బిగ్‌ డిబేట్‌ కార్యక్రమానికి.. సౌత్‌ ఇండియాలోనే బెస్ట్‌ యాంకర్‌గా రజినీకాంత్‌కు అవార్డు. టీవీ9 టాస్క్‌ఫోర్స్‌ బ్లాక్‌మ్యాజిక్‌ కార్యక్రమానికి మరో అవార్డు. అద్రాస్‌పల్లిలోని 'చితిపై మరో చితి' బాణామతి కథనానికి.. బెస్ట్‌ లేట్‌ ప్రైమ్‌టైం షో అవార్డు.
  • కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన కేంద్రం. స్థానికుల ప్రయోజనాలను కాపాడుతామని హామీ. త్వరలో ప్రత్యేక హోదా స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తాం -కేంద్రమంత్రి జితేందర్‌సింగ్‌.
  • రామానాయుడు స్టూడియోలో ప్రెషర్‌ కుక్కర్‌ సినిమా చూసిన కేటీఆర్‌. ప్రెష్‌ ఎనర్జీ, మంచి మెసేజ్‌తో సినిమా ఉంది. డాలర్‌ డ్రీమ్స్‌ కోసం అందరూ అమెరికాకు పరుగులు పెడుతున్నారు. కథలోని కంటెంట్‌ను అందరికీ అర్ధమయ్యేలా సినిమా తీశారు-మంత్రి కేటీఆర్‌.
  • తూ.గో: కోటనందూరు మండలం అప్పలరాజుపేటలో విద్యుత్‌షాక్‌తో మామిడి శ్రీను అనే వ్యక్తి మృతి.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. శ్రీవారి ఉచిత దర్శనానికి 24 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 56,837 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు.

ఫ్రమ్ శ్రీనగర్ టు ఢిల్లీ.. రాహుల్ బృందం తిరుగుముఖం

Rahul Gandhi Vists Sri Nagar, ఫ్రమ్ శ్రీనగర్ టు ఢిల్లీ.. రాహుల్ బృందం తిరుగుముఖం

జమ్మూకాశ్మీర్లో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మరో 11 మంది విపక్ష నాయకులను అక్కడినుంచి తిరిగి ఢిల్లీ పంపివేశారు. శ్రీనగర్ విమానాశ్రయంలో వీరిని పోలీసులు అడ్డుకోవడంతో.. వీరికి, ఖాకీలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ఉద్రిక్తత తలెత్తింది. కాశ్మీర్ లో నిషేధాజ్ఞలు అమలులో ఉన్న దృష్ట్యా.. రాజకీయ నాయకులు శ్రీనగర్ ను విజిట్ చేయరాదని, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని జమ్మూ కాశ్మీర్ సమాచార, ప్రసార శాఖ ట్వీట్ చేసింది. క్రాస్ బోర్డర్ టెర్రరిజం, ఇతర దాడుల ముప్పు ఉన్న నేపథ్యంలో.. వాటి నుంచి ఈ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం రక్షిస్తున్నందున వీరి రాక వల్ల పరిస్థితి మరింత జటిలం కావచ్ఛునని పేర్కొంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని, సీనియర్ నేతలు వచ్చినందువల్ల మళ్ళీ ఇది ఉద్రిక్తతకు దారి తీయవచ్చునని అధికారులు అంటున్నారు.

రాహుల్ తో బాటు వెళ్లిన పార్టీల నాయకుల్లో సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసి, డీఎంకె కు చెందినవారున్నారు. కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన అనంతరం అక్కడి తాజా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు వీరంతా విమానంలో శ్రీనగర్ బయల్దేరారు. అయితే తామంతా బాధ్యతాయుతమైన పార్టీలకు చెందిన నేతలమని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు అక్కడికి వెళ్లడం లేదని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ అంతకుముందు ఢిల్లీలో పేర్కొన్నారు. 20 రోజులుగా కాశ్మీర్ నుంచి ఎలాంటి సమాచారం లేదు. పరిస్థితి నార్మల్ గానే ఉందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ మమ్మల్ని ఎందుకు అనుమతించడం లేదు.. ? అని వారు ప్రశ్నించారు.
కాగా-రాహుల్ వెంట వెళ్లిన ప్రతిపక్ష పార్టీల నేతల్లో సీతారాం ఏచూరి (సీపీఎం), డీ. రాజా, (సీపీఐ), తిరుచ్చి శివ (డీఎంకె), మనోజ్ ఝా (ఆర్జేడీ), దినేష్ త్రివేదీ (టీఎంసీ) తదితరులున్నారు.

Related Tags