Mahabubnagar: ఇప్పటివరకు లోక్‌సభలో అడుగుపెట్టని మహిళలు.. ఈసారైనా పాలమూరు ఓటర్లు చరిత్ర తిరగరాసేనా..!

ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇప్పటి వరకు మహిళలు పార్లమెంట్ మెట్లు ఎక్కలేదు. సుధీర్ఘ కాలంగా మహిళా నేతలు బరిలో ఉంటున్న రెండు స్థానాల్లో ఒక్కసారి కూడా ఆమెను లోక్‌సభకు పంపలేదు పాలమూరు ప్రజలు. మహిళలే ఎక్కువగా ఓటర్లు ఉన్నప్పటికీ మహిళా నాయకురాలిని గెలిపించుకోలేకపోతున్నారు.

Mahabubnagar: ఇప్పటివరకు లోక్‌సభలో అడుగుపెట్టని మహిళలు.. ఈసారైనా పాలమూరు ఓటర్లు చరిత్ర తిరగరాసేనా..!
Dk Aruna
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 04, 2024 | 9:12 AM

ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఇప్పటి వరకు మహిళలు పార్లమెంట్ మెట్లు ఎక్కలేదు. సుధీర్ఘ కాలంగా మహిళా నేతలు బరిలో ఉంటున్న రెండు స్థానాల్లో ఒక్కసారి కూడా ఆమెను లోక్‌సభకు పంపలేదు పాలమూరు ప్రజలు. మహిళలే ఎక్కువగా ఓటర్లు ఉన్నప్పటికీ మహిళా నాయకురాలిని గెలిపించుకోలేకపోతున్నారు. తాజా ఎంపీ ఎన్నికల్లో అయిన ఎదో ఒక స్థానం నుంచి మహిళా ఎంపీగా ఎన్నుకునే కల నెరవేరుస్తారా అన్నదీ ఆసక్తిగా మారింది..!

మొదటి నుంచి పాలమూరు పాలిటిక్స్ కాస్తా డిఫరెంట్. దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల్లో అనేక రకాల ఈక్వేషన్స్ తో అభ్యర్థులు ఎన్నికల్లో విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్న ఓటర్లు తాజా పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుధీర్ఘ కాలంగా ఎంతో మంది మహిళ నేతలు బరిలో ఉన్న ప్రతిసారీ ఓటమే వరించింది. ఈ సారైన పాలమూరు ఓటర్లు ఆ చరిత్ర తిరగరాస్తారా అనేది ఓ పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన ఏకైక మహిళా డీకే అరుణ. 1996లో తొలిసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019 ఎంపీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. ఇక ఇప్పుడు మూడోసారి ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ దఫా కూడా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి గట్టి పోటీ ఇస్తున్నారు. ఎలాగైనా సరే ఈసారి పార్లమెంట్ లో అడుగుపెట్టాలని సర్వశక్తులు ఒడ్డుతున్నారు డీకే అరుణ.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి పలువురు మహిళలు పోటీ చేసినప్పటికీ ఎవరికి విజయం వరించలేదు. 1996 నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇందిరా పోటీ చేసి ఓటమి చెందారు. 2004లో బీఎస్పీ తరుపున రాణి రత్నమాల పోటీ చేసి గెలవలేదు. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బంగారు శృతి పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యారు. ఈ దఫా పోటీ చేయాలని టికెట్ ఆశించినప్పటకీ కమలం అధిష్టానం ఇతరులకు టికెట్ కేటాయించారు. మరోవైపు నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి ఈసారి స్వతంత్ర అభ్యర్థిగా శిరీష(బర్రెలక్క), మరో ఇద్దరు మహిళలు బరిలో నిలిచారు.

గత సంప్రదాయాలకు భిన్నంగా పార్లమెంట్ ఎన్నికల్లో పాలమూరు ప్రజలు మార్పు కోరుకుంటారా అనేది ఆసక్తిగా మారింది. సుధీర్ఘ కాలంగా పోటీకే పరిమితమవుతున్న మహిళలు ఈసారైనా ఉమ్మడి జిల్లా నుంచి పార్లమెంట్ లో అడుగుపెడతారా లేదో చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
ఇంత మంచి బిజినెస్‌ ప్లాన్‌ మీరెప్పుడూ చూసి ఉండరు.? ఇంట్లో ఉంటూనే
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
పోలింగ్ అల్లర్లపై నివేదికకు సిట్ ఏర్పాటు.. వీరిపై ఈసీ కఠిన చర్యలు
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
కనుమరుగైన పూజా హెగ్డే.. బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టేనా ??
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
అలా.. సోమశిలా. తక్కువ బడ్జెట్‌లో రెండు రోజుల టూర్‌ ప్యాకేజీ..
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
సినిమాల్లేక శ్రీలీల కష్టాలు.. ఆ పనులతో తెగ బిజీబిజీ.!
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?
వర్షంతో 5 ఓవర్ల మ్యాచ్ జరిగితే.. ఆర్‌సీబీ టార్గెట్ ఎలా ఉందంటే?