బీజేపీలోకి మెగాస్టార్..? సాదరంగా స్వాగతిస్తున్నాం : మాణిక్యాల రావు

మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారా..? బీజేపీ సీనియర్ నేత కథనం ప్రకారం.. అవుననే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. చిరంజీవి లాంటి వ్యక్తి బీజేపీలో చేరితే మేము సాదరంగా స్వాగతిస్తామని పేర్కొన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు. జులై 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని, అభిమానమున్న వారు పార్టీ సభ్యత్వంలో నమోదు చేసుకోవాలని […]

బీజేపీలోకి మెగాస్టార్..? సాదరంగా స్వాగతిస్తున్నాం : మాణిక్యాల రావు
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 26, 2019 | 5:35 PM

మెగాస్టార్ చిరంజీవి కూడా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరబోతున్నారా..? బీజేపీ సీనియర్ నేత కథనం ప్రకారం.. అవుననే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు చిరంజీవి బీజేపీలో చేరతారన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. చిరంజీవి లాంటి వ్యక్తి బీజేపీలో చేరితే మేము సాదరంగా స్వాగతిస్తామని పేర్కొన్నారు బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు. జులై 6 నుంచి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం కాబోతుందని, అభిమానమున్న వారు పార్టీ సభ్యత్వంలో నమోదు చేసుకోవాలని కోరారు.

కాగా.. ఏపీలో జనసేన, కాంగ్రెస్‌ పార్టీలలో కూడా ఒక కుదుపు రాబోతుందని అన్నారు. 2024 నాటికి దేశంలో చంద్రబాబు మినహా 150 మంది యోధాను యోధులైన నాయకులు వయస్సు కారణంగా తెరమరుగు అవుతారు. అనంతరం బీజేపీ నవ చైతన్యంతో ముందుకు దూసుకెళ్తుందని పేర్కొన్నారు. అందుకే.. అందరూ బీజేపీ వైపే చూస్తున్నారని స్పష్టం చేశారు. ఇక దేశమంతా బీజేపీ పార్టీనే ఉంటుందని వ్యాఖ్యానించారు పైడికొండల మాణిక్యాల రావు.