Tirupati By-Election: ప్రచార పర్వంలో సవాళ్ళ జోరు.. హీటెక్కుతున్న తిరుపతి ఉప ఎన్నిక.. సై అంటే సై

పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్ది తిరుపతి లోక్‌సభ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నిక ప్రచార పర్వం వేడెక్కుతోంది. నిన్న, మొన్నటి దాకా ప్రచారాంశాలు మాత్రమే వినిపించగా..

Tirupati By-Election: ప్రచార పర్వంలో సవాళ్ళ జోరు.. హీటెక్కుతున్న తిరుపతి ఉప ఎన్నిక.. సై అంటే సై
Tirupati
Follow us

|

Updated on: Apr 11, 2021 | 3:18 PM

Tirupati By-Election campaign heating up slowly: పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్ది తిరుపతి (TIRUPATI) లోక్‌సభ సీటుకు జరుగుతున్న ఉప ఎన్నిక (BY-ELECTION) ప్రచార పర్వం వేడెక్కుతోంది. నిన్న, మొన్నటి దాకా ప్రచారాంశాలు మాత్రమే వినిపించగా తాజాగా ఉప ఎన్నిక ప్రచార పర్వం సవాళ్ళు, ప్రతి సవాళ్ళకు వేదికవుతోంది. తిరుపతి ఉప ఎన్నిక (TIRUPATI BY-ELECTION)ను రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా తెలుగుదేశం (TELUGU DESAM PARTY) పార్టీ నేతలు అభివర్ణించడంతో ఆ వ్యాఖ్యలకు వైసీపీ (YCP) నేతలు ధీటుగా స్పందించారు. ఫలితంగా ఉప ఎన్నికల పర్వం కాస్త సవాళ్ళకు, ప్రతిసవాళ్ళకు వేదికగా మారి ప్రచార పర్వం కాస్తా వేడెక్కింది.

సిట్టింగ్ ఎంపీగా వుండిన బల్లి దుర్గా ప్రసాద్ (BALLI DURGAPRASAD) కరోనా వైరస్ (CORONAVIRUS) సోకి మరణించడంతో తిరుపతి లోక్‌సభ సీటు (TIRUPATI LOKSABHA SEAT)కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ (CENTRAL ELECTION COMMISSION) నిర్ణయించింది. తిరుపతి ఉప ఎన్నిక ప్రకటనకు ముందే తెలుగుదేశం పార్టీ గతంలో పోటీ చేసిన పనబాక లక్ష్మి (PANABAKA LAKSHMI) అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా.. అధికార వైసీపీ మాత్రం కొంచెం సమయం తీసుకుని అభ్యర్థిని ఖరారు చేసింది. డా. గురు మూర్తి (DR. GURUMURTY)ని అధికార పార్టీ ఉప ఎన్నిక బరిలోకి దింపింది.

మరోవైపు భారతీయ జనతా పార్టీ (BHARATIYA JANATA PARTY) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PRIME MINISTER NARENDRA MODI) చరిస్మాతో గెలవాలనుకుంటూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి కే.రత్నప్రభ (K RATNAPRABHA) ఉప ఎన్నికల్లో పోటీకి దింపింది. మరోవైపు తిరుపతి నుంచి ఇప్పటికి ఆరు సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన చింతా మోహన్ (CHINTA MOHAN) కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY) తరపున మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభ్యర్థుల ఖరారు తర్వాత ప్రచారంపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు.. ప్రస్తుతం సవాళ్ళు, ప్రతి సవాళ్ళతో దూసుకుపోతున్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారానికి విపక్ష నేత చంద్రబాబు (CHANDRABABU) రాగా.. అధికార వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS JAGANMOHAN REDDY) మాత్రం తిరుపతి ఓటర్లకు ఓ బహిరంగ లేఖ (OPEN LETTER) విడుదల చేసి వైసీపీని గెలిపించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 14న నిర్వహించ తలపెట్టిన వైసీపీ ఎన్నికల సభను రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CHANDRABABU NAIDU) తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. తిరుపతి ఉప ఎన్నికలో అధికార పార్టీని ఓడించడం ద్వారా ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అదే క్రమంలో తిరుపతి ఉప ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్‌గా ఆయన అభివర్ణించారు. దాంతో వైసీపీ నేతలు ధీటుగా జవాబిస్తున్నారు.

ప్రజాహిత కార్యక్రమాలే వైసీపీకి బలమని ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (PEDDIREDDY RAMCHANDRAREDDY) అన్నారు. తిరుపతి ఉప ఎన్నికను రెఫరెండంగా తీసుకుంటున్నామన్న ఆయన .. తెలుగుదేశం గెలిస్తే తమ ఎంపీలంతా రాజీనామాకు సిద్ధమన్నారు. వైసీపీ అభ్యర్థి గెలిస్తే తెలుగుదేశం ఎంపీలు ముగ్గురు, వారి వద్ద ఉన్న రఘురామకృష్ణరాజు రాజీనామా చేస్తారా అని సవాల్‌ విసిరారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి మద్దతుగా ఆదివారం (ఏప్రిల్ 11) ఉదయం వైసీపీ నేతలతో కలిసి తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ (BJP), జనసేన (JANASENA), టీడీపీ (TDP) మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. పాచిపోయిన లడ్డూ ఇప్పుడు పవన్‌కు తాజా లడ్డూ అయ్యిందా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. సునీల్‌ దియోధర్‌ ఎలాంటి వ్యక్తో మేఘాలయ ప్రజలకు తెలుసని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. కరోనా తీవ్రత దృష్ట్యానే సీఎం సభ రద్దు చేసుకున్నారని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

ALSO READ: ఆమె త్యాగానికి చలించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్.. ఏకంగా ఇంటికెళ్ళి ఆమె చేత్తో..!