ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగు దేశం పార్టీ(TDP) మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ బలహీనమైన నాయకుడని.. అది కరెక్ట్ కాదు బలహీనంగా ఉన్నాడనేది కేబినెట్ విస్తరణతో తేలిపోయిందన్నారు. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో క్యాబినెట్ కూర్పుపై సీఎం దిష్టిబొమ్మను, టైర్లను కాల్చుతూ ఆందోళనలు చేయటం ఇదే మొదటిసారి జరిగిందన్నారు. నూతన క్యాబినెట్ ఏర్పాటులో ఎక్కడా సమతుల్యత లేదన్నారు. 26 జిల్లాలు అని చెప్పి ప్రధాన నగరమైన విశాఖకు, విజయవాడకు, తిరుపతికి, 8 జిల్లాలకు మంత్రులు లేకుండా చేశారని అన్నారు. ఏపీలోనూ బిగ్గెస్ట్ సిటీగా ఉన్న విశాఖకు మంత్రి లేకపోవడం బాధాకరమని అన్నారు.ఇది కరెక్ట్ కాదని సూచించారు. ఎన్నికలకి రెండేళ్ల ముందు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చామంటే ప్రజలు YCPని నమ్మే పరిస్థితిలో లేదన్నారు. వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా.. టీడీపీకి బీసీలు ఎప్పుడూ అ౦డగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
కొన్నింటి నుంచి డైవర్ట్ చేయడం కోసం అర్జెంట్ గా ఎటువంటి ఎక్సర్సైజ్ లేకుండా జిల్లాల విభజన ప్రవేశపెట్టారు. దీనిపై స్వంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ధర్నాలు చేసారు. ఈ క్యాబినెట్ మార్పు వల్ల వాళ్లు కొత్తగా సాధించిందేమిటని ప్రశ్నించారు. దీనిపై రెండు మూడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల నుంచి రియాక్షన్ వచ్చింది. ఎన్నికలు దగ్గరకొచ్చే కొలది టీడీపీలోకి చేరికలు ఎక్కువవుతాయి.
ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు రావచ్చన్నారు. విద్యారంగంలో మార్పులపై సైంటిఫిక్ స్టడీ చేసి నిపుణుల సలహా తీసుకుని చేస్తే బావుంటుందన్నారు. కాని తక్కువ టైంలో హడావుడి చేస్తున్నట్టుగా ఉందన్నారు. నిన్న సీఎం జగన్ జరిపిన విద్యా శాఖ సమీక్షలో విద్యుత్ శాఖ మ౦త్రి పాల్గోకపోవడం.. బట్టి ఏవిధమైన మెసేజ్ ఇస్తున్నామనేది తెలుస్తోందన్నారు. తమ పార్టీ అధినేత చేపట్టబోయే కార్యక్రమాలను త్వరలోనే అనౌన్స్ చేస్తారు.
ఇవి కూడా చదవండి: Watch Video: వీహెచ్ కారు అద్దాలు ధ్వంసం చేసింది ఇతనే.. సీసీటీవీలో రికార్డ్ ..
Bandi Sanjay: ఇవాళ్టి నుంచి ప్రజా సంగ్రామం.. అలంపూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర..