ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. దానం నాగేందర్‌కు ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది.

ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చుక్కెదురు.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు..!
Danam Nagender, Supreme Court

Updated on: Sep 24, 2026 | 12:24 PM

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పార్టీ ఫిరాయింపుల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం.. దానం నాగేందర్‌కు ఉపశమనం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగడం దాదాపు ఖాయమైంది.

దానం నాగేందర్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున ఖైరతాబాద్ నుంచి విజయం సాధించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి, 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీనిని పార్టీ ఫిరాయింపుగా పరిగణిస్తూ ఆయన అనర్హతపై పిటిషన్లు దాఖలయ్యాయి.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని, తనపై తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరారు.

అయితే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ దానం నాగేందర్ పిటిషన్‌ను తిరస్కరించింది. అవసరమైతే ఉప ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చని సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఉప ఎన్నికపై ఆసక్తి నెలకొనగా.. ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Loading...
Unable to load recommendations.
Follow Us