సుజనా వ్యాఖ్యలతో రచ్చ రచ్చ..వైసీపీ, టిడిపి ఏమంటున్నాయంటే?

బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి పేల్చిన బాంబు ఏపీలో రచ్చ రంబోలా చేస్తోంది. టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతుంటే, సుజనా చౌదరి మాత్రం కొత్త పల్లవి ఎత్తుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు బీజేపీలో చేరడానికి వెంపర్లాడుతున్నారంటూ సుజనా అగ్గి రాజేశారు. ఆయన కామెంట్స్‌పై వైసీపీ నేతలు బాంబుల్లా పేలితే, టీడీపీ నేతలు లాజిక్‌ పాయింట్‌ తీస్తున్నారు. ప్రధాని మోదీ ఒక వైసీపీ ఎంపీ భుజం చెయ్యి వేయడమే ఈ ఉలికిపాటు కారణం […]

సుజనా వ్యాఖ్యలతో రచ్చ రచ్చ..వైసీపీ, టిడిపి ఏమంటున్నాయంటే?
Follow us

|

Updated on: Nov 22, 2019 | 5:59 PM

బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి పేల్చిన బాంబు ఏపీలో రచ్చ రంబోలా చేస్తోంది. టీడీపీ నేతలు వైసీపీ వైపు చూస్తున్నారని ఏపీలో ప్రచారం సాగుతుంటే, సుజనా చౌదరి మాత్రం కొత్త పల్లవి ఎత్తుకున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు బీజేపీలో చేరడానికి వెంపర్లాడుతున్నారంటూ సుజనా అగ్గి రాజేశారు. ఆయన కామెంట్స్‌పై వైసీపీ నేతలు బాంబుల్లా పేలితే, టీడీపీ నేతలు లాజిక్‌ పాయింట్‌ తీస్తున్నారు. ప్రధాని మోదీ ఒక వైసీపీ ఎంపీ భుజం చెయ్యి వేయడమే ఈ ఉలికిపాటు కారణం అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మరో మలుపు తిరిగిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఇపుడు ఆంధ్రా పాలిటిక్స్‌లో రచ్చ రచ్చ చేస్తోంది.

రాజకీయాల్లో విపక్ష పార్టీకి వలసల భయం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి ట్రెండ్‌ రివర్స్‌ అంటున్నారు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి. వైసీపీతోపాటు ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని సుజనా చేసిన వ్యాఖ్యలు అధికారపక్షంలో ప్రకంపనలు పుట్టించాయి. సుమారు 20 మంది వరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు బిజెపితో టచ్‌లో వున్నారంటూ సుజనా పెద్ద బాంబే పేల్చారు.

సుజనా వ్యాఖ్యలు వైసీపీలో కలకలం రేపాయి. అధినేత ఆదేశం మేరకు రంగంలోకి దిగిన వైసీపీ బృందం సుజనాను ఓ ఆటాడుకుంది. తాను బాకీలు ఎగ్గొట్టిన బ్యాంకు ఆఫీసర్ల ముందు సుజనా మాట్లాడితే ఆయన పార్టీ మార్పిడికి కారణం తెలుస్తుందని వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. మిగతా వైసీపీ నేతలు మాత్రం సుజనాకి విశ్వసనీయత లేదని, బ్యాంక్‌ దొంగ అని, టీడీపీ నుంచి వచ్చిన వారిని బీజేపీ నేతలే నమ్మడం లేదని కౌంటర్లు ఇస్తున్నారు.

టీడీపీ నేతలు మాత్రం- తమవాళ్లెవరూ పార్టీ మారనని అంటూనే, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భుజంపై ప్రధాని చెయ్యి వేయగానే ఆ పార్టీ అంతా ఉలిక్కి పడిందని అంటున్నారు. ఏపీలో తామే ప్రత్యామ్నాయంటున్న బీజేపీ నేతలు మాత్రం- సుజనా చౌదరి లైన్‌లో మాట్లాడడం లేదు. అయితే, వైసీపీ నేతలు డిమాండ్‌ చేసినట్లు పక్కచూపులు చూస్తున్న వారి పేర్లను సుజనా బయటపెడతారా అన్నది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఆసక్తికర చర్చ.