రాహుల్ విమానంలో ఇంజిన్ ట్రబుల్.. తృటిలో తప్పిన ప్రమాదం

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఎన్నికల ప్రచారానికి  బీహార్‌ బయలు దేరగా..  మార్గ మధ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో తిరిగి ఢిల్లీ వెళ్తున్నట్లు రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఇంజిన్‌లో వచ్చిన సమస్యను వీడియో తీసి ఆయన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాగా ఇవాళ బీహార్, ఒడిషా, మహారాష్ట్రల్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనాల్సి ఉంది. అయితే విమానంలో […]

రాహుల్ విమానంలో ఇంజిన్ ట్రబుల్.. తృటిలో తప్పిన ప్రమాదం

Updated on: Apr 26, 2019 | 11:48 AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి ఎన్నికల ప్రచారానికి  బీహార్‌ బయలు దేరగా..  మార్గ మధ్యంలో ఆయన ప్రయాణిస్తున్న విమానంలోని ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో తిరిగి ఢిల్లీ వెళ్తున్నట్లు రాహుల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే ఇంజిన్‌లో వచ్చిన సమస్యను వీడియో తీసి ఆయన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కాగా ఇవాళ బీహార్, ఒడిషా, మహారాష్ట్రల్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనాల్సి ఉంది. అయితే విమానంలో సమస్య తలెత్తడంతో జరగాల్సిన సభలు కాస్త ఆలస్యంగా జరుగుతాయని పేర్కొన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us