రాహుల్ గాంధీయే ట్రబుల్ షూటర్… శశిథరూర్

| Edited By:

May 29, 2019 | 11:37 AM

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఇక ఆ పార్టీ పని అయిపోయిందని కొందరు వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. అలాంటివి చాలా తొందరపాటు వ్యాఖ్యలని ఆయన అన్నారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఈ లోక్‌సభ ఫలితాలు కూల్చలేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. అయితే ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడం రాహుల్‌తోనే సాధ్యమవుతుందని శశిథరూర్ అన్నారు. […]

రాహుల్ గాంధీయే ట్రబుల్ షూటర్... శశిథరూర్
Follow us on

సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఇక ఆ పార్టీ పని అయిపోయిందని కొందరు వ్యాఖ్యానించడంపై ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. అలాంటివి చాలా తొందరపాటు వ్యాఖ్యలని ఆయన అన్నారు. వందల ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఈ లోక్‌సభ ఫలితాలు కూల్చలేవని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని.. అయితే ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడం రాహుల్‌తోనే సాధ్యమవుతుందని శశిథరూర్ అన్నారు. ఎన్నికల ఓటమిని తల్చుకుంటూ బాధపడే కన్నా… కొన్ని రాష్ట్రాల్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధం కావడం మంచిదని అన్నారు. అంతేకాకుండా పార్టీ కోరితే లోక్‌సభలో కాంగ్రెస్ తరఫున ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధమని ప్రకటించారు.