అక్టోబర్ నుండి అసలైన ఆట మొదలవుతుంది..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా రాజకీయాలపై హాట్‌హాట్‌గా విమర్శలు గుప్పించారు. అక్టోబర్ నుండి అసలైన ఆట మొదలుపెట్టబోతున్నామని అన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తానని.. ముఖ్యంగా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో నా బలం ఎంతో తెలుసుకోవడానికే ఒంటరిగా దిగానని.. 2019 ఎన్నికల్లో దిగానన్నారు. పవన్ సైలెంట్‌గా ఉన్నారని అనుకుంటున్నారేమో.. బట్టలు చించుకుని, గుండెల బద్దలుకొట్టుకునే కార్యకర్తలు నా వెనుక ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వాళ్ల భవిష్యత్తు కోసమే నేను […]

అక్టోబర్ నుండి అసలైన ఆట మొదలవుతుంది..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 31, 2019 | 6:24 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా రాజకీయాలపై హాట్‌హాట్‌గా విమర్శలు గుప్పించారు. అక్టోబర్ నుండి అసలైన ఆట మొదలుపెట్టబోతున్నామని అన్నారు. త్వరలోనే అన్ని నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తానని.. ముఖ్యంగా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో నా బలం ఎంతో తెలుసుకోవడానికే ఒంటరిగా దిగానని.. 2019 ఎన్నికల్లో దిగానన్నారు. పవన్ సైలెంట్‌గా ఉన్నారని అనుకుంటున్నారేమో.. బట్టలు చించుకుని, గుండెల బద్దలుకొట్టుకునే కార్యకర్తలు నా వెనుక ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు వాళ్ల భవిష్యత్తు కోసమే నేను పోరాడుతున్నానని చెప్పారు. గత ఎన్నికల్లో నన్ను జాతీయ పార్టీల నేతలు.. పక్క రాష్ట్రాల నేతలు ఆహ్వానించారని.. కానీ.. నేను తిరస్కరించాను.. అయినా.. పొత్తుల వల్ల వచ్చే బలం శాశ్వతం కాదని పేర్కొన్నారు.

కాగా.. అధిక మెజార్టీలో ఉన్నాం కదా అని బాధ్యతలు మర్చిపోకూడదని అన్నారు. మెజార్టీ ఉంటే ఏదైనా చెయ్యెచ్చు అనే ధోరణి మంచిది కాదని.. కొత్తగా వచ్చే రిజర్వేషన్ల అంశం చాలా సున్నితమైందని పవన్ అన్నారు. దేశ వ్యాప్తంగా రిజర్వేషన్ల సమస్య ఉంది.. అలాగే.. ఇసుక వెను మాఫీయా కంటే.. లక్షలాది కార్మికుల ఉపాధి ఆధారపడి ఉందని.. వారిని దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వం పాలసీని త్వరగా ప్రకటించాలని.. లేదంటే జనసేన ఉద్యమిస్తుందని తెలిపారు పవన్ కల్యాణ్.