AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెపోటుతో గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కన్నుమూత

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు.

గుండెపోటుతో గుజరాత్ మాజీ సీఎం కేశూభాయ్ పటేల్ కన్నుమూత
Balaraju Goud
|

Updated on: Oct 29, 2020 | 12:53 PM

Share

గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. కేశూభాయ్ పటేల్ రెండు దఫాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇటీవల సెప్టెంబరు 30న సోమనాథ్ మందిర్ ట్రస్ట్‌కు రెండవసారి అధ్యక్షునిగా ఎంపికయ్యారు. 1930 జూలై 24న జన్మించిన కేశూభాయ్ పటేల్ భారతీయ జనతా పార్టీలో సీనియర్ నేతగా ఎదిగారు. గుజరాత్‌కు 1995 మార్చి నుంచి 1995 అక్టోబరు వరకు మొదటి పర్యాయం, 1998 మార్చి నుంచి 2001 అక్టోబరు వరకు రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2001లో గుజరాత్‌లో జరిగిన ఉపఎన్నికలలో బీజేపీకి ఆశించిన స్థాయిలో విజయం లభించలేదు. దీంతో ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాలని కేశూభాయ్ పటేల్‌పై ఒత్తిడి రావడంతో పదవి నుంచి తప్పుకున్నారు. కేశూభాయ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Follow Us