గవర్నర్ ను ఆహ్వానించకపోవడం మూర్ఖత్వానికి పరాకాష్ట.. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు

|

Mar 01, 2022 | 6:14 PM

గవర్నర్‌(Governor) ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Meetings) నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయం తీసుకోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్...

గవర్నర్ ను ఆహ్వానించకపోవడం మూర్ఖత్వానికి పరాకాష్ట.. సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
Bandi Sanjay
Follow us on

గవర్నర్‌(Governor) ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Meetings) నిర్వహించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయం తీసుకోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. ‘మహిళా గవర్నర్‌ కాబట్టే ఇంతగా అవమానిస్తున్నారా? రాష్ట్ర ప్రథమ పౌరురాలిని గౌరవించే తీరు ఇదేనా?’ అంటూ నిప్పులు చెరిగారు. బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ట అని సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహిళలంటే ముఖ్యమంత్రికి మొదటి నుంచీ చులకన భావమేనని, తొలి కేబినెట్ లో ఒక్క మహిళకూ చోటివ్వలేదని మండిపడ్డారు. రాష్ట్ర మహిళలందరూ కేసీఆర్ తీరును గమనించాలని కోరారు. బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తానంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చట్టాల్ని గౌరవించలేని, సంప్రదాయాల్ని పాటించలేని వ్యక్తికి ప్రభుత్వంలో కొనసాగే హక్కు లేదని అన్నారు. ఈ నిర్ణయం రాజ్యాంగ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలను మంట కలిపేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై నమ్మకం లేకపోతే వెంటనే ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ ను ఆహ్వానించకపోవడం సీఎం మూర్ఖత్వానికి పరాకాష్ట. మహిళలంటే సీఎంకు మొదటి నుండి చులకన భావమే. తొలి కేబినెట్ లో ఒక్క మహిళకు కూడా చోటివ్వలేదు. రాష్ట్ర మహిళలందరూ కేసీఆర్ తీరును గమనించాలని కోరుతున్నాను. బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తానంటే చూస్తూ ఊరుకునేది లేదు.                                                                               – బండి సంజయ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు

మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. మార్చి 7వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌ను ప్రకటించింది. అయితే, ఈ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండబోదని, సీఎం కేసీఆర్ ఆమేరకు నిర్ణయం తీసుకున్నారని అధికారవర్గాల సమాచారం. కాగా, రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6వ తేదీన సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. మార్చి7వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. సమావేశాల్లో భాగంగా విధిగా వస్తున్న గవర్నర్ ప్రసంగం ఉండబోదని, నేరుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెడతారని ప్రభుత్వ వర్గాల విశ్వసనీయ సమాచారం.

Also Read

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల కుమారుడు ‘జైన్‌ నాదెళ్ల’ గురించి కొన్ని అంశాలు..

Maha Shivaratri 2022: శివరాత్రి జాగారం చేస్తున్నారా.. లింగోద్భవ సమయం ఎప్పుడో తెలుసా..!

Maha Shivaratri 2022: శివరాత్రి జాగారం చేస్తున్నారా.. లింగోద్భవ సమయం ఎప్పుడో తెలుసా..!