Jogi Ramesh: ఏ పార్టీ వచ్చినా ఏపీలో భయపడాల్సిన అవసరం లేదు.. BRSపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు..

టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభావం ఏం ఉండదంటూ స్పష్టం చేశారు.

Jogi Ramesh: ఏ పార్టీ వచ్చినా ఏపీలో భయపడాల్సిన అవసరం లేదు.. BRSపై మంత్రి జోగి రమేష్ కీలక వ్యాఖ్యలు..
Jogi Ramesh
Follow us

|

Updated on: Oct 05, 2022 | 2:42 PM

తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ ఆవిర్భావం కోసం ఏర్పాటైన టీఆర్ఎస్ పార్టీ.. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించింది. టీఆర్ఎస్ ఇకపై భారత్ రాష్ట్ర సమితిగా మారుస్తూ సీఎం కే చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా పరిణామాలు, టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ ప్రభావం ఏం ఉండదంటూ స్పష్టం చేశారు. దేశంలో చాలామంది పార్టీలు పెట్టుకుంటారని.. వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం ఏపీలో ఒకరి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి లేదన్నారు. ఏ పార్టీ వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదని.. రాబోయే 25 ఏళ్లు జగనే సీఎంగా ఉంటారని స్పష్టంచేశారు.

బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ పెట్టిన ఏ పార్టీ వచ్చినా.. ఏపీలో వైసీపీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని.. జాతీయ పార్టీ పెట్టుకోవచ్చని తెలిపారు. దీనిలో తప్పు లేదన్నారు. దేశ ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు రాష్ట్రంలో గడప గడపకు వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్‌ను రాష్ట్రం చేస్తున్న పనులను మెచ్చుకున్నారని తెలిపారు. ఏపీలో ప్రజలంతా తమ వైపే ఉన్నారని.. ఎలాంటి ఢోకా లేదని పేర్కొన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రారంభించిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు మరే రాష్ట్రంలోనూ అమలు కావడంలేదని జోగి రమేష్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..