Hyderabad: పాతబస్తీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన.. ఒవైసీకి పూలమాల వేసి, కండువా కప్పి పండితుల ఆశీస్సులు!

హైదరాబాద్‌ పాతబస్తీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ గల్లీ గల్లీలో తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (AIMIM) పార్టీ అభ్యర్థి, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మలక్‌పేట్ నియోజకవర్గ పరిధిలోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ముస్లిం, హిందూ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే లలితాబాగ్ పరిధిలో అసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Assaduddin Owaisi
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 04, 2024 | 1:05 PM

హైదరాబాద్‌ పాతబస్తీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ గల్లీ గల్లీలో తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్-ముస్లిమీన్ (AIMIM) పార్టీ అభ్యర్థి, హైదరాబాద్ సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మలక్‌పేట్ నియోజకవర్గ పరిధిలోని పలు వీధుల్లో తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అడుగడుగునా ముస్లిం, హిందూ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే లలితాబాగ్ పరిధిలో అసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

మలక్‌పేట్ సరస్వతీ నగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న అసదుద్దీన్ ఒవైసీ, హిందూ దేవాలయం సమీపంగా వెళ్తున్నారు. ఇది గమనించిన ఆలయ పూజారులు ఆయనకు స్వాగతం పలికారు. పూజారులు ఒవైసీకి పూలమాల వేసి, కండువా కప్పి ఆశీస్సులు అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఘటనతో ఒవైసీకి ముస్లింలతో పాటు హిందూవులు కూడా అభిమానిస్తారనడం ఉదాహరణ అంటూ ఎంఐఎం కార్యకర్తలు చెప్పుకుంటున్నారు.

వీడియో చూడండి..

హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ బరిలో ఉన్న సంగతి తెలిసిందే..! 54 ఏళ్ల అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ నియోజకవర్గానికి నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించారు. హైదరాబాద్‌లో లోక్‌సభ ఎన్నికల నాలుగో విడతలో మే 13న జరగనున్న నేపథ్యంలో ఆయన నగరంలో ఇంటింటికీ ప్రచారం నిర్వహిస్తూ, ర్యాలీల్లో ప్రసంగిస్తున్నారు. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకు నాలుగో దశలో పోలింగ్ జరగనుంది. హైదరాబాద్‌లో ఒవైసీపై పోటీ చేసేందుకు బీజేపీ మాధవి లతను బరిలోకి దింపింది. ఒవైసీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 2.5 లక్షల ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన భగవంతరావుపై విజయం సాధించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌

ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత

అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..

'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?

టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం

కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. బరిలోకి దిగనున్న పవర్ స్టార్

చీతాతోనే గేమ్సా.. దెబ్బకు సుస్సుపోయించిందిగా..

రాత్రి భోజ‌నం.. నిద్ర ఆఫీస్‌‎లోనే.. 40 గంటలపాటు వినూత్న నిరసన..

రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..
రణబీర్ రామాయణం బడ్జెట్ తెలిస్తే షాకే..