నష్టాలకు బై బై.. లాభాలకు సై

నీరవ్ మోదీ వంటి డిఫాల్టర్లు.. పెద్ద మొత్తంలో బకాయిలు ఎగవేసి విదేశాలకు చెక్కేయడంతో నష్టాల బాటపట్టిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మళ్లీ మంచిరోజులొచ్చాయి. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభాలను ప్రకటించింది. ప్రస్తుతం రూ.1019 రూపాయల లాభాలను రాబట్టింది. గతేడాది రూ.900 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చూసిన పీఎన్బీ మొండి బకాయిలను తగ్గించుకుంది. కాగా పోయిన సంవత్సరం ఇదే త్రైమాసికంలో 5,713 కోట్లుగా ఉన్న ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 64.8 శాతానికి […]

నష్టాలకు బై బై.. లాభాలకు సై
Follow us

| Edited By:

Updated on: Jul 27, 2019 | 1:34 PM

నీరవ్ మోదీ వంటి డిఫాల్టర్లు.. పెద్ద మొత్తంలో బకాయిలు ఎగవేసి విదేశాలకు చెక్కేయడంతో నష్టాల బాటపట్టిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు మళ్లీ మంచిరోజులొచ్చాయి. 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ తొలి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాభాలను ప్రకటించింది. ప్రస్తుతం రూ.1019 రూపాయల లాభాలను రాబట్టింది. గతేడాది రూ.900 కోట్ల రూపాయలకు పైగా నష్టాలను చూసిన పీఎన్బీ మొండి బకాయిలను తగ్గించుకుంది. కాగా పోయిన సంవత్సరం ఇదే త్రైమాసికంలో 5,713 కోట్లుగా ఉన్న ప్రొవిజన్లు, కంటింజెన్సీలు 64.8 శాతానికి తగ్గాయి. దీంతో లాభాల బాట పట్టింది.