Breaking News
  • ప్రకాశం: కనిగిరిలో డాక్టర్‌ విద్యాసాగర్‌పై కేసు. ఈనెల 11న కజికిస్థాన్‌ నుంచి వచ్చిన డాక్టర్‌ విద్యాసాగర్‌. సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో డాక్టర్‌పై కేసు.
  • విజయనగరం: కొత్తవలసలో పోలీసుల దురుసుప్రవర్తన. విధి నిర్వహణలో ఉన్న లైన్‌మన్‌పై పోలీసుల దాడి. చిత్రీకరిస్తున్న జర్నలిస్ట్‌ పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులు.
  • అమరావతి: బయోమెట్రిక్ లేకుండానే రేషన్‌ ఇస్తున్నాం. ఇబ్బందులు ఉంటే తహశీల్దార్‌, ఎండీవోకు ఫిర్యాదు చేయండి. పేదలందరికీ రేషన్‌ వచ్చేలా చర్యలు-మంత్రి కొడాలి నాని.
  • సీఎం సహాయనిధికి ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఐపీఎస్‌ల అసోసియేషన్‌, విరాళాన్ని సీఎం కేసీఆర్‌కు అందజేసిన అసోసియేషన్‌ అధ్యక్షుడు అంజనీకుమార్‌.
  • స్పెయిన్‌లో విజృంభిస్తున్న కరోనా. కరోనాతో స్పెయిన్‌ రాకుమారి మారియా టెరెసా మృతి.

మన్మోహన్ కాదు.. మోదీనే.. నవంబర్ 8న ఏం జరగబోతోంది..?

PM Modi to inaugurate Kartarpur Corridor on November 8: Harsimrat Kaur Badal, మన్మోహన్ కాదు.. మోదీనే.. నవంబర్ 8న ఏం జరగబోతోంది..?

కర్తార్ పూర్ కారిడార్‌ను నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నట్లు కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ తెలిపారు. డేరా బాబా నానక్‌లోని దర్బార్ సాహిబ్ గురుద్వారాను, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ సాహిబ్‌ గురుద్వారాను అనుసంధానించే 4.5 కిలోమీటర్ల పొడవైన రహదారి ఇది. గురుదాస్ పూర్లోని డేరా బాబా నానక్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. అంతకుముందు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గురు నానక్ దేవ్ 550వ ప్రకాశ్ పర్వ్ ఉత్సవాలను నవంబరులో నిర్వహిస్తారు. భారతదేశంలోని సిక్కులు కర్తార్‌పూర్ కారిడార్ గుండా పాకిస్థాన్‌లోని గురు నానక్ గురుద్వారాకు చేరుకుంటారు. కాగా, పాకిస్థాన్‌లోని కర్తార్‌పూర్ కారిడార్‌ను నవంబరు 9న ప్రారంభించనున్నారు.

కర్తార్ పూర్ కారిడార్.. విశిష్టత

కర్తార్ పూర్ ఉత్తర భారత రాజకీయాల్లో మరీ ముఖ్యంగా పంజాబ్‌తో ముడిపడి ఉన్న అంశం. అంతేకాదు.. ఇది భారత్ – పాకిస్థాన్‌ ల మధ్య కీలక అంశంగా మారింది. అసలు ఇంతకు ఈ కర్తార్‌పూర్ ఏంటీ..? దాని విశిష్టత ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం.
సిక్కులు మత విశ్వాసాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారన్న విషయం అందరికీ తెలిసందే. అందులో భాగంగా ఆ మతానికి, గురువులకు, గురుగ్రంథ్ సాహిబ్‌కు సిక్కులు అమూల్యమైన ప్రాధాన్యత ఇస్తారు. సిక్కు మత వ్యవస్థాపకుడు డేరా బాబా గురు నానక్ దేవ్. ఈయన1469 నవంబర్ 29న పంజాబ్‌లో జన్మించారు. 1539 సెప్టెంబర్ 22న ఆయన మరణించారు. అయితే ఆయన పుట్టిన, మరణించిన స్థలాలు రెండు ఇప్పుడు పాకిస్థాన్‌లోనే ఉన్నాయి. ఆయన జన్మస్థలం లాహోర్‌కు దగ్గర్లోని నాన్ కనా సాహిబ్‌లో ఉంది. అక్కడ ఉన్న గురుద్వారాను గురుద్వారా జనమ్ ఆస్థాన్ అని పిలుస్తారు. గురునానక్ దేవ్ చివరిరోజులను కర్తార్ పూర్‌లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు 18 ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు. అయితే ఆయన సమాధి చుట్టే గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను నిర్మించారు. ఇది లాహోర్‌కు 120కిలోమీటర్ల దూరంలో నరోవల్ జిల్లాలో ఉంది. అయితే దేశ విభజన సమయంలో గురుద్వారా దర్బార్ సాహిబ్ పాక్‌లోకి వెళ్లిపోయింది.
అయితే గురుద్వారా దర్బార్ సాహిబ్ కర్తాపూర్ పాక్‌లోనే ఉన్నప్పటికీ భారతదేశ సరిహద్దుకు కేవలం 3కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాకిస్థాన్ వెళ్లి గురుద్వారాను దర్శించుకోలేని సిక్కులు భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం గురుదాస్ పూర్ జిల్లా మన్ గ్రామం దగ్గర ఇంటర్నేషనల్ బోర్డర్ లో నిలబడి బైనాక్యులర్ ద్వారా గురుద్వారాను దర్శించుకుని దండం పెట్టుకుంటారు.

Related Tags