మాది ద్వైపాక్షిక సమస్య..కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. మోదీ

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షికంగా ఉన్న సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, మూడో దేశ మధ్యవర్తిత్వానికి ఆస్కారమే లేదని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫ్రాన్స్ లోని బియరిట్జ్ లో.. జీ-7 సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆయన ఈ విస్పష్టమైన ప్రకటన చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో దేశ ప్రమేయం అక్కర్లేదన్నారు. ఇండియా-పాక్ దేశాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయని, మేం కూర్చుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. […]

మాది ద్వైపాక్షిక సమస్య..కాశ్మీర్ పై మధ్యవర్తిత్వం అక్కర్లేదు.. మోదీ
Follow us

|

Updated on: Aug 26, 2019 | 5:51 PM

భారత-పాకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షికంగా ఉన్న సమస్యలను తామే పరిష్కరించుకుంటామని, మూడో దేశ మధ్యవర్తిత్వానికి ఆస్కారమే లేదని ప్రధాని మోదీ ప్రకటించారు. ఫ్రాన్స్ లోని బియరిట్జ్ లో.. జీ-7 సమ్మిట్ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ఆయన ఈ విస్పష్టమైన ప్రకటన చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి మూడో దేశ ప్రమేయం అక్కర్లేదన్నారు. ఇండియా-పాక్ దేశాల మధ్య ఎన్నో ద్వైపాక్షిక సమస్యలు ఉన్నాయని, మేం కూర్చుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు. పేదరికం, నిరక్షరాస్యత వంటి వాటిపై ఈ రెండు దేశాలూ పోరాడవలసి ఉందని, ఈ దేశాల ప్రజల అభ్యున్నతికి కలిసికట్టుగా పాటు పడాల్సి ఉందని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని నేను పాకిస్తాన్ ప్రధానికి కూడా స్పష్టం చేశాను.. నిజానికి ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ప్రధానిగా ఎన్నిక కాగానే ఆయన్ను అభినందించాను.. ఉభయ దేశాల అభివృద్దికి కృషి చేద్దాం అని చెప్పానని మోదీ వివరించారు. ఇదే సందర్భంలో నేను మీతో (ట్రంప్) కూడా టచ్ లో ఉంటూనే ఉన్నా అన్నారు. అమెరికా, భారత దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడాలని తాను కోరుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఉభయ దేశాల ప్రజల మధ్య సాన్నిహిత్యం దృఢతరం కావాలని మోదీ ఆకాంక్షించారు. అటు-ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా అని, గ్రేట్ లీడర్లతో ( మోదీ, ఇమ్రాన్ ఖాన్ లతో) తనకు స్నేహం ఉందని ట్రంప్ చెప్పారు. తమ సమస్యలను వారు పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. కాగా… మోదీ, ట్రంప్ ఇద్దరూ చిరునవ్వులతో మీడియా ముందుకు వచ్చారు. ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. .