పసుపు, ఆకుపచ్చ.. ఇందులో ఏ నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Updated on: May 19, 2026 | 11:33 AM

నిమ్మకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే సమ్మర్ వస్తే చాలు చాలా మంది మార్కెట్‌లో నిమ్మకాయలను కొనుగోలు చేస్తుంటారు. అయితే నిమ్మకాయలు ఎక్కువగా రెండు రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పసుపు, ఆకు పచ్చ రంగుల్లో ఉంటాయి. కాగా, ఇందులో ఏ రంగు నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిది. దీనిలో ఏది తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దాం.

1 / 5
ప్రతి ఇంటిలో తప్పకుండా ఉండే వాటిలో నిమ్మకాయ ఉంటుంది. దీని వలన అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా దీనిని వంటల్లో ఉపయోగించుకోవడమే కాకుండా క్లీనింగ్‌కు కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది. అందుకే చాలా మంది తప్పకుండా నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు. ఇక ఇది ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పినా తక్కువే. దీని వలన ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

2 / 5
ముఖ్యంగా నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా సమ్మర్‌లో నిమ్మకాయతో షర్బత్ చేసుకొని తాగడం వలన ఇది డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. అలసట, నీరసం నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ సమ్మర్‌లో మార్కెట్‌కు వెళితే చాలు తప్పకుండా నిమ్మకాయలు కొనుగోలు చేస్తారు.

3 / 5
అయితే మార్కెట్‌లో రెండు రకాలు, పసుపు, ఆకుపచ్చ నిమ్మకాయలు ఉంటాయి. అందులో ఏది ఆరోగ్యానికి మంచిది? రెండింటిలో ఉన్న తేడాలు ఏవి అంటే?  రెండు నిమ్మకాయలు ఒక్కటే అయినప్పటికీ  రంగును బట్టి నిమ్మకాయలకు ప్రత్యేక గుణం ఉంటుంది.  ఆకు పచ్చ రంగు నిమ్మకాయలతో పోలిస్తే, పసుపు రంగు నిమ్మకాయ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మానికి సహజ మెరుపును అందిస్తుంది. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

4 / 5
ఆకుపచ్చ నిమ్మకాయ, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. డీ హైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది.  ఈ రెండు నిమ్మకాయలను రుచి ప్రకారం చూస్తే, ఆకుపచ్చ నిమ్మకాయలో రసం చాలా తక్కువగా కాస్త పుల్లగా, వగరుగా ఉంటుంది. అదే పసుపు రంగు నిమ్మకాయలో రసం ఎక్కువగా, కాస్త తీపి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇలా రంగును బట్టి దాని రుచి, పోషక విలువలు కూడా మారుతాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
అంతే కాకుండా ఆకుపచ్చ నిమ్మకాయను ఎక్కువగా వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా మాక్టెయిల్స్ మోజిటోల వంటి వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇక పసుపు రంగు నిమ్మకాయలు డ్రింక్స్‌కు ఎక్కువగా వాడుతారు, సలాడ్ రూపంలో కూడా తీసుకుంటారు.  ఇక రెండు నిమ్మకాయల్లో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా పసుపు రంగు నిమ్మకాయలో ఉంటుంది. అదే విధంగా, విటమిన్ సి ఎక్కువగా ఆకపుపచ్చ రంగు నిమ్మకాయలో ఉంటుంది.

Follow Us