
మన ఇళ్ళలో ఉండే ప్రతి కిచెన్లో ఉప్పు తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే, ఇది చాలా ప్రత్యేకమైనది. అయితే, ఇది ప్రతి దేశంలో తక్కువ ధరకే దొరుకుతుంది. ఇప్పుడు చెప్పబోయే ఉప్పు ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

ఆ ఉప్పు మరేదో కాదండి కొరియన్ వెదురు ఉప్పు. దీనిని చాలా మంది వెదురు ఉప్పు అని పిలుస్తారు. అంతే కాదు, దీనికి ఇంకో పేరు కూడా ఉంది. జుగ్యోమ్ అని కూడా అంటారు. పావు కిలో సాల్ట్ ధర రూ. 8,811, ఇక కిలో ధర అయితే వేలల్లో పలుకుతుంది రూ. 35,000 కు పైగా ఉంది.

ఈ ఉప్పు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనది. దీనిని ఎక్కువగా వైద్యంలో వాడతారు. కొందరు దీనిని ఒక ఔషధంగా చూస్తారు. దీని ధర కిలో 400 డాలర్లకి పైగా ఉంటుంది. ఈ ఉప్పును ఒక వెదురు కాండంలో ప్యాక్ చేసి ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు కాల్చడం వంటివి చేస్తుంటారు.

ఈ కొరియన్ వెదురు ఉప్పును పెద్ద పెద్ద వెదురు డబ్బాలలో నింపి, మట్టితో కప్పేసి, వాటిని ఇనుప కొలిమిలో కాల్చి, నిప్పులో బాగా వేయిస్తారు దేవదారు చెట్టు కట్టెలతో బట్టీ చేసి వాటిని బాగా కాల్చుతారు.

కాల్చిన తర్వాత ఈ ఉప్పు గట్టి పడుతుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి తీసి ఉప్పును నిండుగా నింపి బాగా కాల్చుతారు. ఇలా తొమ్మిది సార్లు బాగా కాలిస్తే కానీ ఈ ఉప్పు తయారవుతుంది. అందుకే, ఈ ఉప్పు అంత ఖరీదైనదిగా మారింది