Radioactive Waste: జపాన్ చేస్తోన్న పనితో ఉప్పు, చేపలు కొనుగోలుకి ఎగబడుతున్న కొరియన్స్.. మానవాళిని ప్రమాదంలో నెడుతుందన్న చైనా

|

Jul 01, 2023 | 10:33 AM

ప్రకృతికి మానవుడి జీవితానికి అవినాభావ సంబంధం ఉంది. మానవుడి చేసిన తప్పిదాలతో ప్రకృతి కోపిస్తే మానవాళి భయభ్రాంతులకు గురికావాల్సిందే. అందుకు ఉదాహరణగా అనేక సంఘటనలు నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియాలో ప్రజలు సూపర్ మార్కెట్ల వద్ద క్యూలు కట్టారు. ఉప్పు, చేపలు కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. 

1 / 5
దక్షిణ కొరియాలో చిన్న చిన్న దుకాణాల్లోకూడా ఉప్పుకొనేందుకు జనం ఎగబడుతున్నారు. వాస్తవానికి 5 కిలోల ఉప్పును కొనుగోలు చేసే వారు కూడా ఇప్పుడు తన శక్తికి సామర్ధ్యానికి మించి 5 నుండి 10 రెట్లు ఎక్కువ ఉప్పుని కొనుగోలు చేసి నిల్వ చేయాలనుకుంటున్నాడు. ఒక్క ఉప్పు మాత్రమే కాదు చేపలు కూడా భారీ మొత్తంలో కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలనుకుంటున్నాడు. దీనికి కారణం జపాన్ దేశం.  

2 / 5
వాస్తవానికి జపాన్ దేశంలోని ఫుకుషిమా దైచి అణు విద్యుత్ కేంద్రం నుండి మిలియన్ల టన్నుల శుద్ధి చేసిన రేడియోధార్మిక నీటిని సముద్రంలోకి డంప్ చేయాలని నిర్ణయించుకుంది. మీడియా నివేదికల ప్రకారం 2011లో ఏర్పడిన భూకంపం, సునామీ తర్వాత దెబ్బతిన్న అణు రియాక్టర్లను చల్లబరచడానికి ఈ నీటిని ఉపయోగించారు.

3 / 5
జపాన్ దేశం తీసుకున్న నిర్ణయంపై పొరుగు దేశాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా చైనా ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవడం మంచిది కాదని.. జపాన్ చేయనున్న పనితో సముద్ర జీవులకు హాని కలిగిస్తుందని అభివర్ణించింది. దక్షిణ కొరియాలో ఉప్పు, చేపలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఇదే కారణం.

4 / 5
సముద్రంలో రేడియోధార్మిక నీటిని రిలీజ్ చేస్తే సముద్ర జలం విషతుల్యం అవుతుందని భావిస్తున్నారు. దక్షిణ కొరియాలోని  ప్రజలు తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఉప్పును కొనుగోలు చేసి నిల్వ చేసుకోవాలనుకుంటున్నారు. గత రెండు నెలల్లో ఉప్పుకు ఫుల్ డిమాండ్‌ ఏర్పడింది. ధరలు 27 నుంచి 30 శాతం మేర పెరగడానికి ఇదే కారణం.

5 / 5
అయితే తాము సముద్రంలో రిలీజ్ చేయాలనుకుంటున్న నీటిని శుద్ధి చేస్తామని అప్పుడే సముద్రంలోకి రిలీజ్ చేస్తామని  జపాన్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే నీరు హైడ్రోజన్ ఐసోటోప్‌లతో కలుషితమైందని, అది సముద్రపు ఉప్పు, షెల్ఫిష్ వంటి వాటిలోకి చేరుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఐసోటోప్‌లను తొలగించడం ద్వారా నీటిని శుద్ధి చేస్తున్నట్లు జపాన్ పేర్కొంది. CNBC నివేదిక ప్రకారం ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ బ్రెంట్ హుస్సర్ ఈ నీటిలో చాలా తక్కువ మొత్తంలో ట్రిటియం ఉందని... ఇది హానికరం కాదని పేర్కొన్నారు. 