
పాతకాలంలో బాగా నీరసంగా ఉన్నప్పుడు ఇది గిన్నెడు తినే వాళ్లు. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన టెన్షన్ తగ్గించడం కోసం ఈ పాయసం చేసుకుని తినేవాళ్లు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా ఇది ఏంటి? దీనిని ఎలా చేయాలి? దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం..

కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు బార్లీ, నీరు 2 కప్పులు , బెల్లం పొడి 1 కప్పు, అర లీటర్ కొబ్బరి పాలు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 6 నుండి 8 పచ్చి యాలకుల తీసుకోవాలి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఎండుద్రాక్షలు గుప్పెడు, జీడిపప్పు, నట్స్ కూడా వేస్తే పాయసానికి మంచి రుచి వస్తుంది.

తయారీ విధానం స్టెప్ 1 : బార్లీని తీసుకుని బాగా కడిగి, ఆ నీటిని వడకట్టాలి. ఇంకా దీనిలో 2 కప్పుల నీటిని ప్రెషర్ కుక్కర్లో పోసి, ఇది బాగా మెత్తగా అయ్యే వరకు 4 నుండి 5 విజిల్స్ వచ్చే వరకు దీనిని పొయ్యి మీదే ఉంచి బాగా ఉడికించుకోవాలి. ఇంకా ప్రెషర్ మొత్తం పోయే వరకు దీనిని అలాగే ఉంచాలి.

తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు ఉడికించిన బార్లీలో కొద్దిగా బెల్లం పొడిని మీరు దీనిలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఆ తరవాత ఈ బెల్లం మొత్తం కరిగే వరకు మీడియం మంట మీద బాగా కలుపుతూ ఉండాలి. ఇంకా 2 నిమిషాల పాటు సన్నని మంట మీద ఈ బార్లీని ఉడికించండి.

మంటను కొద్దిగా తగ్గించండి. ఆ తర్వాత దీనిలో కొబ్బరి పాలు, పచ్చి యాలకుల పొడి కూడా వేసి దీనిలో మంచిగా కలుపుకోవాలి. ఇంకా మీడియం మంట మీద 10 నిమిషాల పాటు మెల్ల మెల్లగా దీనిని బాగా ఉడకనివ్వాలి. ఇంకా ఒక చిన్న పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా దీనిలో చేసి, నాలుగు జీడిపప్పు , ఎండుద్రాక్షలను వేసి బాగా తిప్పాలి.