
మన చర్మం ఒక్కోసారి మృదుత్వాన్ని సహజమైన కాంతిని కోల్పోతోంది. అందులోనూ చలికాలంలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ సమస్యను అధిగమించి, మీరు తిరిగి సహజమైన అందాన్ని సొంతం చేసుకోవాలంటే ఈ చిట్కాలను పాటించండి. రోజూ తగినంత నీరు తాగాలిమనం ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలి. తగినంత నీరు తాగడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చర్మం కూడా తాజాగా, కాంతివంతంగా కనిపించడానికి సహాయపడుతుంది. కాబట్టి రోజూ నీళ్లు తాగడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి.

పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్ : ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు, రెండు మూడు చుక్కల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయవచ్చు.

టమాటోతో ముఖానికి స్క్రబ్.. ఒక టమాటోను సగానికి కట్ చేసుకుని, దానిపై కొద్దిగా చక్కెర రాయాలి. ఆ తర్వాత ముఖంపై ఎలాంటి ఒత్తిడి పెట్టకుండా మృదువుగా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా 10 నుంచి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.

నారింజ తొక్కలను బాగా ఎండబెట్టి మెత్తని పొడిలా చేసుకుని ఒక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిలో రెండు టేబుల్ స్పూన్ల పాలు, అర టేబుల్ స్పూన్ తేనె, మూడు నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నుంచి 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి ఒకసారి చేయవచ్చు. ఐస్ వాటర్‌తో ముఖానికి చిట్కా .. ఒక గిన్నెలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుని, కొద్దిగా నీళ్లు పోయాలి. ఆ నీటిలో ముఖాన్ని కొద్దిసేపు ఉంచి వెంటనే బయటకు తీయాలి. ఇలా మూడు నుంచి నాలుగుసార్లు చేయాలి. ఈ చిట్కా ముఖం తాజాగా కనిపించడానికి ఉపయోగపడుతుంది.

శనగపిండితో ఫేస్ ప్యాక్ : ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. అందులో అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి మెత్తని పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్‌లా వేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయవచ్చు. దీనివల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. ఈ చిట్కాలను గనుక మీరు పాటించినట్లయితే సహజమైన సౌందర్యం మీ సొంతం కావడమే కాకుండా, మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తూ మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు.