Watermelon: పుచ్చకాయను ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందో తెలుసా..? తినేముందు ఇవి పక్కా తెలుసుకోండి..

Updated on: Apr 10, 2026 | 8:09 AM

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. అందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. ఎర్రగా, తీయగా ఉంటూ దాదాపు 92 శాతం నీటిని కలిగి ఉండే ఈ పండు, ఎండల నుండి ఉపశమనం పొందడానికి ఉత్తమమైన మార్గం. అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని భావించే పుచ్చకాయను తినే విషయంలో మనం చేసే కొన్ని తప్పులు ప్రాణాల మీదకు తెచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుచ్చకాయ తినడం వల్ల కలిగే నష్టాలను వైద్యులు వివరిస్తున్నారు.

1 / 5
పోషకాల గని.. కానీ: 100 గ్రాముల పుచ్చకాయలో సుమారు 45 కేలరీలు ఉండటంతో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, పొటాషియం, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, కంటి ఆరోగ్యానికి ఎంతో తోడ్పడతాయి. అయితే దీనిని తీసుకునే సమయం, పద్ధతి సరిగ్గా లేకపోతే ప్రయోజనం కంటే హానీ ఎక్కువ జరుగుతుంది.

2 / 5
 షుగర్ లెవల్స్‌లో ఆకస్మిక మార్పు: పుచ్చకాయలో సహజ చక్కెరలు అధికం. ఖాళీ కడుపుతో దీనిని తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా ప్రీ-డయాబెటిస్ ఉన్నవారికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుంది. పుచ్చకాయ అధికంగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్ర విసర్జన జరుగుతుంది. దీనివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని, నీరసం, బలహీనత వచ్చే అవకాశం ఉంది.

3 / 5
జీర్ణ సమస్యలు - కడుపు ఉబ్బరం: అధిక నీటి శాతం వల్ల ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు కడుపు భారంగా అనిపించడం, గ్యాస్ పట్టేయడం లేదా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇప్పటికే ఎసిడిటీ లేదా గుండెల్లో మంటతో బాధపడేవారు ఉదయాన్నే పుచ్చకాయ తింటే, అది జీర్ణవ్యవస్థతో త్వరగా ప్రతిస్పందించి సమస్యను మరింత తీవ్రం చేస్తుంది.

4 / 5
నిపుణులు ఏమంటున్నారు?: అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ నిపుణులు డాక్టర్ రోహిత్ శర్మ అభిప్రాయం ప్రకారం.. పుచ్చకాయను ఖాళీ కడుపుతో తినడం అందరికీ మంచిది కాదు. ముఖ్యంగా జీర్ణశక్తి తక్కువగా ఉన్నవారు దీనివల్ల విరేచనాల బారిన పడే ప్రమాదం ఉంది.

5 / 5
సరైన పద్ధతి ఏంటి?: పుచ్చకాయను ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకుండా ఏదైనా చిరుతిండి తిన్న గంట తర్వాత తీసుకోవడం ఉత్తమం. దీనిని మధ్యాహ్నం పూట స్నాక్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అందుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలను చూసి గుడ్డిగా అనుసరించకుండా మీ శరీర తత్వానికి ఏది పడుతుందో గమనించుకోవడం ముఖ్యం.

Follow Us